Putin: రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్‌..

Putin:  రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్‌..
ఎన్నికలు బూటకమన్న పశ్చిమదేశాలు

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో 87.29 శాతం ఓట్లు ఆయనకు పోలయ్యాయి. ఈ మేరకు రష్యా ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువరించింది. 7.6 కోట్ల మంది పుతిన్ కు ఓటు వేశారని, ఇంతవరకు ఇన్ని ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారని తెలిపింది. తనపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని పుతిన్ పేర్కొన్నారు. మనం ఐక్యంగా ఉంటే ఎవరూ మనతో పోరాడలేరని రష్యన్లు ఉద్దేశించి ఎన్నికల అనంతరం వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులు గతంలోనూ విఫలమయ్యారని ఇకపైనా వారి గతి అంతేనని పేర్కొన్నారు. అటు పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు..చైనా అధ్యక్షుడు జీన్ పింగ్ , ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అభినందనలు తెలిపారు.

కాలపరీక్షను తట్టుకుని నిలిచిన భారత్ -రష్యా బంధం మరింత బలపుడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాలు మాత్ర ఈ ఎన్నికలు ఒక మిథ్యగా కొట్టిపారేశాయి. తాజా ఎన్నికతో మరో ఆరేళ్లు రష్యా అధినేతగా పుతిన్ కొనసాగనున్నారు. అంతకుముందు 2000 నుంచి 2008 వరకు ఎనిమిదేళ్లు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పనిచేశారు. గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా/ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్‌ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గ ళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్‌.. బ లమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో 87 శాతం ఓట్ల సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మరో ఆరేం డ్లు రష్యా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ పదవీ కాలం పూర్తయితే రష్యాను అత్యధిక కాలం పాలించిన నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 1999 డిసెంబర్‌ నుంచి పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా లేదా ప్రధానిగా కొ నసాగుతున్నారు.

అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూ టమికి, రష్యాకు మధ్య వివాదం చెలరేగితే అ ది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంద ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచం కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నదని హెచ్చరించా రు. అలాంటి స్థితిని ఎవరూ కోరుకోవడం లే దని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సా ధించాక పుతిన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు మద్దతుగా నిలిచిన దేశ పౌరులందరికీ ధన్యవాదాలు చెప్తూ.. ర ష్యాను లొంగదీసుకోవడం ఎవరి వల్లా కాద ని ఇప్పటికే చరిత్ర చెబుతున్నదని అన్నారు. వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఎవరూ రష్యా సంకల్పాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు.

Tags

Next Story