Wagner group :ర‌ష్యాలోనే ప్రిగోజిన్

Wagner group :ర‌ష్యాలోనే ప్రిగోజిన్
వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ఇంటిపై దాడులు, భారీగా బంగారం స్వాధీనం

రష్యా అధినేత పుతిన్‌పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌, రష్యాలోనే ఉన్నట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తెలిపారు.

ప్రిగోజన్ బెలారస్ కు వెళ్లిపోయారని వార్తలు వచ్చిన నేపథ్యంలో...కీలక విషయం వెల్లడైంది. యెవ్ గెనీ ప్రిగోజిన్ప్రిగోజిన్ ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కి ఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్‌ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్‌ సైనిక దళాలు వారి క్యాంప్‌ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్‌లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్‌లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్‌ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.




మరోవైపు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సిటీలో ప్రిగోజిన్‌ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్‌లైన్‌ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. దాడులు నిర్వహించిన వివిధ ప్రాంగణాల నుంచి భారీగా బంగారం, నగదు, విగ్గులు, ఆయుధాలు, పాస్‌పోర్టులు, ఓ స్లెడ్జి హ్యామర్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కోంది. ఈ మేరకు ఓ భవనంలోని ఫొటోలు, వీడియోలను బయటకు విడుదల చేసింది.




అయితే, ప్రిగోజిన్‌ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్‌ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్‌ బెలారస్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. రష్యాపై తిరుగుబాటు ప్రయత్నం చేసిన తర్వాత వాగ్నర్ గ్రూప్ అధినేత వాగ్నర్ దళాలు మాత్రం తిరుగుబాటుకు ముందు బస చేసిన శిబిరాల్లోనే ఉండిపోయినట్లు వివరించారు. పుతిన్ -ప్రిగోజిన్ ల మధ్య బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి....తిరుగుబాటుకు అడ్డుకట్ట వేశారు. ప్రిగోజిన్ సేనలకు భద్రతా హామీలు ఇవ్వడంతో పాటు బెలారస్ లో ఉండేందుకు కూడా అనుమతించారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించిన కొన్ని వివరాలను లుకషెంకో తెలియజేసినప్పటికీ వాగ్నర్ గ్రూప్ సైన్యం ఆచూకీ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రిగోజిన్ బెలారస్ లో ఉన్నారని గత వారం చెప్పిన లుకషెంకో తాజాగా ప్రిగోజిన్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. సంధిలో చేసుకున్న పలు హామీలను ఖరారు చేసుకోవడానికే ప్రిగోజిన్ రష్యాకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story