Prigozhin : అత్యంత భద్రత నడుమ అంత్యక్రియలు

Prigozhin : అత్యంత భద్రత నడుమ అంత్యక్రియలు
హాజరయ్యే ఉద్దేశం లేదని ప్రకటించిన రష్యా అధ్యక్ష భవనం

ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు. కానీ ఏరోజైతే పుతిన్ మీద తిరుగుబాటు ప్రయత్నం చేసాడో ఆరోజు నుంచి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ మరణం అంచున జీవించారు. ఎన్నో ఏళ్లుగా వ్లాదిమిర్ పుతిన్ , ప్రిగోజిన్ సేవలను వాడుకుంటూ వచ్చారు. కానీ, వాగ్నర్ సేనలలో వేలాది మంది సైనికుల తిరుగుబాటు మాత్రం పుతిన్‌కు మింగుడు పడలేదు. ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం, కొన్నిరోజుల వ్యవధిలోనే ఘోర విమాన ప్రమాదంలో మరణించడం ప్రపంచాన్ని మరీ పెద్దగా ఆశ్చర్యపరిచలేదు. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న ప్రిగోజిన్ విమానం మార్గమధ్యంలోనే కూలిపోయింది. ఎలా కూలిపోయిందన్నది ప్రస్తుతానికి ఓ మిస్టరీ. అయితే అందులో ప్రిగోజిన్ ఉన్నాడు అన్నది మాత్రం నిజం. ఆయనతోపాటు మరణించిన పది మందినీ గుర్తించినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.


అయితే తాజాగా ప్రిగోజిన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒకప్పటి తన అంతరంగికుడి అంతిమ సంస్కారాలకు పుతిన్ దూరంగా ఉన్నారు. పొర్ఖొవ్ స్కయా శ్మశానవాటికలో హై సెక్యూరిటీ నడుమ ప్రిగోజిన్ ను ఖననం చేశారు. దీనిపై రష్యా అధ్యక్ష భవనం స్పందించింది. ప్రిగోజిన్ అంత్యక్రియలకు హాజరయ్యే ఉద్దేశం పుతిన్ కు లేదని స్పష్టం చేసింది. కాగా, ఇకపై వాగ్నర్ గ్రూపు ఉంటుందా, ఒకవేళ ఉంటే ఆ గ్రూపుకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్నకి సమాధానం లేదు. ప్రిగోజిన్ యవ్వనంలో దాదాపు సెయింట్ పీటర్స్‌బర్గ్ జైలులోనే గడిపారు. తొమ్మిదేళ్లు జైలులోనే ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో హాట్ డాగ్స్ అమ్మే స్టాళ్లు ఆయన నెలకొల్పారు. వ్యాపారం బాగా సాగడంతో కొద్ది కాలానికే ఆ నగరంలో ఖరీదైన రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు.


ఆ రెస్టారెంట్లు కేంద్రంగా ప్రిగోజిన్‌కు రష్యా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ కేటరింగ్ వ్యాపారాల ద్వారానే పుతిన్ నుంచి సంపద, ప్రోత్సాహం కూడా లభించింది ప్రిగోజిన్‌కి.ఆఫ్రికా, సిరియా, యుక్రెయిన్‌లో ప్రిగోజిన్ కిరాయి వెంచర్లు, ఆయన్ను సైనిక నేతగా నిలబెట్టా

అయితే ప్రిగోజిన్ తొలిసారి ప్రెసిడెంట్ పుతిన్‌కు ఎదురుతిరిగినప్పుడు, దీన్ని ఒక దేశద్రోహంగా పుతిన్ అభివర్ణించారు. ప్రిగోజిన్ తిరుగుబాటు వ్లాదిమిర్ పుతిన్ అధికారాన్ని దెబ్బతీసినట్టు భావించారు. ఈ నేపథ్యంలో 2 నెలలు తిరగకుండానే ప్రిగోజిన్ అంతం అయ్యాడు.

Tags

Next Story