బెలారస్‌ వైపు ప్రిగోజిన్‌ పయనం

బెలారస్‌ వైపు ప్రిగోజిన్‌ పయనం
బెలారస్‌ వైపుగా వాగ్నర్‌ గ్రూప్‌ పయనం

రష్యా నాయకత్వానికి ఒక్కరోజులో ముచ్చెమటలు పట్టించిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూపు చీఫ్‌ ప్రిగోజిన్‌ బెలారస్‌ వైపు వెళుతున్నట్లు మాస్కో తెలిపింది. తాము రష్యాను వీడుతున్నట్లు ప్రకటించిన ప్రిగోజిన్‌.. అన్న మాట ప్రకారమే బెలారస్‌కు రోడ్డు మార్గంలో వెళుతున్నారు. అయితే తనను, తన గ్రూపును అరెస్ట్‌ నుంచి తప్పించేందుకు ప్రిగోజిన్‌ బెలారస్‌కు వెళుతున్నారని రష్టా ప్రకటించింది. మాస్కోను వీడితే ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోబోమన్న ఒప్పందంలో భాగంగా వార్నర్‌ గ్రూప్‌ రష్యాను వీడుతున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. దీంతో వాగ్నర్‌ గ్రూపుతోపాటు ఆయనపై నమోదైన కేసులను రష్యా అధికారులు తొలగించారు. ప్రిగోజిన్‌ సాయుధ తిరుగుబాటును ఆపి బెలారస్‌కు తిరుగు ప్రయాణం కావడంతో ఆయనపై ఉన్న అభియోగాలను రష్యా ఎత్తివేయనుంది. వాగ్నర్‌ గ్రూపు దళాలు కూడా ఎలాంటి ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవు. ప్రిగోజిన్‌తో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో చర్చలు జరిపి సంధి చేశారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని కోరారు. దీనికి ప్రిగోజిన్‌ అంగీకరించారు. వాగ్నర్‌ దళానికి భద్రతపరమైన హామీలు ఇవ్వడం ద్వారా ఒప్పందం కుదిరింది. అనంతరం రష్యాపై తిరుగుబాటును అకస్మాత్తుగా ప్రిగోజిన్‌ ఉపసంహరించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story