రష్యాలో తిరుగుబాటు జండా

రష్యాలో  తిరుగుబాటు జండా
పుతిన్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటున్న వాగ్నర్ గ్రూప్

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు రష్యా తరపున పోరాడిన వాగ్నర్ కిరాయి సైన్యం, ఇప్పుడు అధ్యక్షుడు పుతిన్ కు ఎదురు తిరుగుతోంది. సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది.

ఏడాదిగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సైనిక చర్యల్లో రష్యా బలగాలకు అండగా ఉన్న వార్నర్ గ్రూప్ తిరుగుబాటుబావుటా ఎగరేసింది. మాస్కో లోని సైనిక నాయకత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలిస్తామని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తమ బలగాలను లక్ష్యంగా చేసుకునే రష్యా సైన్యం దాడులకు తెగబడుతుందని ఈ దాడుల్లో తమ వారు వందల మంది చనిపోయారని వార్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఆరోపించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక ప్రదేశాల వెలుపల భద్రతను పెంచింది.

గత సంవత్సరం ఉక్రయిన్ లో దాడి ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ సేనలు చాలా ఎక్కువ చేశారని, ఇప్పుడు వాగ్నర్ ను పూర్తిగా నాశనం చేసే ఆపరేషన్ను రక్షణ మంత్రి సెర్గి షోయొగు పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాము రష్యాకు చెందిన ఒక సైనిక హెలికాఫ్టర్ ను కూల్చేచేసినట్లుగా ఆయన ప్రకటించారు. తాము ముందుకు వెళుతున్నాము, ముగింపు వరకు చేరుకుంటాం అంటూ ప్రిగోజన్ ఆడియో సందేశం విడుదల చేశారు. తమ దళాలు రష్యా దక్షిణ ప్రాంతంలోకి ప్రవేశించి ముందుకు వెళుతున్నామని, ఎదురైనా అడ్డుగోడలను తప్పకుండా ధ్వంసం చేస్తామని ప్రిగోజిన్ హెచ్చరించారు. అలాగే రష్యన్లు ఎవరూ తమకు అడ్డుగా రావద్దని, తమ గ్రూపులో చేరాలని సూచించారు. ఇది సైనిక తిరుగుబాటు కాదు న్యాయం కోసం చేస్తున్న మార్చ్ అని వ్యాఖ్యానించారు. ఈ అనూహ్య పరిణామంతో రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. భయపడాల్సింది ఏం లేదు అని చెబుతూనే సాయుధ తిరుగుబాటుపై క్రిమినల్ విచారణ ప్రారంభించినట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మాస్కోలో అధికారులు భద్రతా చర్యలు కట్టు దిట్టం చేశారు. ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో పక్క రష్యా కు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్, వాగ్నర్ చీఫ్ పై క్రిమినల్ కేసులు పెట్టింది. తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story