Vivek Ramaswamy: నేను గెలిస్తే మస్క్‌కు ఆ పదవి ఇస్తా

Vivek Ramaswamy: నేను గెలిస్తే మస్క్‌కు ఆ పదవి ఇస్తా
ఎలాన్‌ మస్క్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వివేక్‌ రామస్వామి.. ప్రచారంలో దూసుకుపోతున్న ఇండియన్‌-అమెరికన్‌

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న భారతీయ-అమెరికన్ వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారు(presidential adviser)గా ఎలాన్ మస్క్‌ (Musk)ను కోరుకుంటానని పేర్కొన్నారు. అయోవాలోని జరిగిన సమావేశంలో పాల్గొన్న వివేక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన అనంతరం మీ సలహాదారుడి (adviser)గా ఎవరిని నియమిస్తారని అడిగిన ప్రశ్నకు వివేక్‌ సమాధానం ఇచ్చారు.


తన పరిపాలనలో టెస్లా సీఈఓ(tesla ceo) ఎలాన్‌ మస్క్‌ను సలహాదారుడిగా నియమిస్తానని అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా వివేక్‌ వివరించారు. గతేడాది ట్విటర్‌(Twitter)ను మస్క్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారని రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న(Republican presidential candidate) వివేక్‌ గుర్తు చేశారు. అందువల్ల తాను గెలిస్తే.. ఆయననే ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తానని స్పష్టం చేశారు. ట్విటర్‌ మాదిరిగానే ప్రభుత్వాన్ని కూడా ఆయన సమర్థవంతంగా నడిపించగలరని కూడా మస్క్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(US president in 2024) వివేక్‌ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భావిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్‌గా నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో రామస్వామి పేరు మారుమోగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోజురోజుకూ ఆయన ప్రాచుర్యం పెరుగుతోంది.

అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా ఓటర్లను... ముఖ్యంగా రిపబ్లికన్లను 38 ఏళ్ల రామస్వామి వాదన ఆలోచింపజేస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ కేసుల వెంట తిరుగుతుంటే... అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోజురోజుకూ రామస్వామి ప్రాచుర్యం పెరుగుతోంది. రిపబ్లికన్‌ పార్టీలో డొనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వివేక్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

చాలామంది మొహమాటపడో, విమర్శలకు భయపడో, వివాదాలకు జడిసో... మాట్లాడకుండా వదిలేసే సత్యాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ అమెరికన్ల మద్దతును వివేక్‌ పెంచుకుంటున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వానికి ప్రయత్నిస్తూనే... మరోవైపు రాజకీయ కేసుల్లో ట్రంప్‌నకు మద్దతుగా రామస్వామి నిలబడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story