WEDDING: రూ.కోట్లు చెల్లించి.. యువతిని పెళ్లాడిన తాత

టార్మాన్ అనే 74 ఏళ్ల వ్యక్తి తన కంటే 50 సంవత్సరాలు చిన్నదైన యువతిని పెళ్లాడాడు. ఈ పెళ్లి కోసం ఆ యువతికి ఆ వ్యక్తి ఏకంగా రూ.2 కోట్లు కన్యాశుల్కం చెల్లించాడు. ఇండోనేసియాలో లో జరిగిన ఈ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టార్మాన్ (74), అరికా(24)ల వివాహం తూర్పు జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో అక్టోబరు 1న జరిగింది. ఈ వివాహం చేసుకునేందుకు గాను టార్మాన్ ఆ యువతికి దాదాపు రూ.2 కోట్లు చెల్లించాడు. అయితే ఫొటోగ్రాఫర్లకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నారట. పెళ్లి అయిన తర్వాత తమకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా నవదంపతులు అదృశ్యమయ్యారని ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. వధువుకు తొలుత రూ.60లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, వివాహ వేడుక సమయంలో ఏకంగా రూ.1.8కోట్లు చెల్లించారట. ఇక పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా కొంత డబ్బును రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చారు. ఈ వేడుకలు ముగిసిన కొద్దిసేపటికీ.. నవ దంపతులు అదృశ్యమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com