SWIFT : రష్యా పై స్విఫ్ట్‌ బ్యాన్

SWIFT : రష్యా పై స్విఫ్ట్‌ బ్యాన్
SWIFT : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అడ్డుకొనేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి.

SWIFT : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అడ్డుకొనేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, బ్రిటన్‌లు.. సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌ - స్విఫ్ట్‌ నుంచి రష్యా బ్యాంకులను తొలగించాయి. ఈ చర్యలను త్వరలోనే అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్విఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ పేమెంట్‌ వ్యవస్థ వెల్లడించింది. దీంతో రష్యా బ్యాంకింగ్‌ రంగం ఇంటర్నేషనల్‌ లావాదేవీలు నిర్వహించడం కష్టంగా మారుతుంది

ఈ యుద్ధానికి రష్యానే బాధ్యత వహించేలా వ్యూహాత్మక తప్పిదంగా పుతిన్‌కు తెలిసొచ్చేలా చేస్తాంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను ఏకాకిని చేసినట్లు తెలిపారు. వీటిని కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డేర్‌ లెయాన్‌ ధ్రువీకరించారు. మరోవైపు... రష్యా సంపన్నులు, కంపెనీల ఆస్తులను వేటాడేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది అమెరికా. రష్యన్ల యాట్లు, విలాసమైన కార్లు, భవనాలు, గోల్డెన్‌ పాస్‌పోర్టులు, వారి పిల్లలు పశ్చిమ దేశాల కళాశాలల్లో చదవకుండా అడ్డుకొనేలా చర్యలు తీసుకొంటుంది. అమెరికా ఆంక్షలు పూర్తిగా, సమర్థంగా అమలయ్యేలా చూస్తుంది.

మరోవైపు.... అంక్షల నుంచి తట్టుకొనేందుకు రష్యా.... 600 బిలియన్‌ డాలర్లు విలువైన రిజర్వులను సెంట్రల్‌ బ్యాంక్‌లో నిల్వ చేసింది. ఈ నిధుల్ని వినియోగించకుండా చేయాలనే లక్ష్యంతో ఈ నిషేధం విధించినట్లు తెలిపింది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌. అటు... విదేశాల్లోని రష్యా రిజర్వులు సైతం సమర్థంగా స్తంభింపజేస్తున్నట్లు వెల్లడించింది. స్విఫ్ట్‌ బ్యాన్‌తో రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇది దీర్ఘకాలం ఉంటుంది. ఈ నిషేధం రష్యా చమురు, గ్యాస్‌ విక్రయిం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story