అదృష్టం బావుంది.. లేకపోతే అంతే సంగతులు

భూమికి దూరంగా, ఆకాశానికి దగ్గరగా ఉన్నట్టుండే మెట్రో రైల్లో ప్రయాణం మజాగానే ఉన్నా డ్రైవర్ ఒక్క క్షణం ఏమరపాటు వహిస్తే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అంత ఎత్తునుంచి కింద పడితే అడ్రస్ లేకుండా పోతాం. ఊహించుకుంటేనే భయంగా ఉంది.. అదృష్టం బావుంటే ఏదో ఒక రూపంలో మన ప్రాణాలకు అడ్డుగా నిలుస్తుంది. ద్యావుడా.. మాకు భూమ్మీద నూకలింకా మిగిల్చావా అని అనుకుంటూ ఇంటికి చేరతాము. అయితే నెదర్లాండ్‌లోని రోటర్డ్యామ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వంతెన మీద అదుపు తప్పిన ఓ మెట్రో రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. కానీ కిందపడలేదు. ఎందుకంటే.. ఆ వంతెనను ఆనుకుని ఉన్న ఓ పేద్ద తిమిలంగం శిల్పం రైలుని కింద పడకుండా అడ్డుకుంది.
సోమవారం ఉదయం 12.30 గంటల సమయంలో స్పిజ్కేనిస్సేలోని డి అక్కెర్స్ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇదే అక్కడి చివరి మెట్రో రైల్ డెడ్ ఎండ్ వరకు వెళ్లింది. అయితే అది అదుపు తప్పి ముందుకు వెళ్లింది. వంతెనను ఢీకొట్టి కిందపడబోయిన రైలును భారీ సైజు తిమింగలం విగ్రహానికి చెందిన తోక అడ్డుకుంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఆ రైలు 32 అడుగుల ఎత్తు నుంచి కిందపడేది.. అదృష్టవశాత్తు ఆ రైల్లో ప్రయాణికులు కూడా ఎవరూ లేదు.. ఒక్క మెట్రో లోకో పైలెట్ మాత్రమే ఉన్నాడు. ప్రమాదంలో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇప్పుడు ఆ రైలు నీటి మధ్యలో ఉన్న విగ్రహంపైనే ఉంది. దీన్ని అక్కడి నుంచి తీయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com