Bastille Day: అసలేంటీ బాస్టిల్ డే?

ప్రధాని నరేంద్ర మోదీ... ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే(Bastille Day) వేడుకల్లో పాల్గొన్నారు. సాధారణంగా విదేశీ నేతలు పాల్గొనని ఈ వేడుకల్లో భారత ప్రధాని(PM Modi) రెండోసారి పాల్గొని సుదీర్ఘంగా సాగిన సైనిక కవాతును వీక్షించారు. ఇంతకీ ఈ బాస్టిల్ డే అంటే.. ఫ్రాన్స్‌లో ఈ వేడుకలకు అంత ప్రత్యేకత ఎందుకు తెలుసుకుందాం రండి..
ఫ్రాన్స్‌లో రాచరికంపై తిరుగుబాటుకు నాంది పలికిన సందర్భాన్ని బాస్టిల్ డేగా ఫ్రాన్స్ జాతీయులు ప్రతి జులై 14వ తేదీని జరుపుకుంటారు. జులై 14 ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. బాస్టిల్ అనేది నిజానికి ఓ కోట పేరు. అప్పటి లూయి 16 అనే రాజు తన వ్యతిరేకులను, రాజకీయ ఖైదీలను, ఉన్నతస్థాయి ఖైదీలను ఈ కోటలో బంధించి హింసించే వాడు. దీనికి వ్యతిరేకంగా చాలామంది ప్రజలు ఆయుధాలు చేతబట్టి జులై 14న బాస్టిల్ వైపు కవాతు నిర్వహించారు. వేలాదిగా వచ్చిన వారిపై అప్పటి రాజు లూయిస్ 16(Louis XVI) కాల్పులకు ఆదేశాలిచ్చారు. అయినా వెనక్కి తగ్గని ప్రజలు బాస్టిల్ భవనాన్ని నేలమట్టం చేశారు. ఈ ప్రజా దాడిలో బాస్టిల్ గవర్నర్ బెర్నార్డ్-రెనే డి లౌనే, పారిస్ మేయర్ మరణించారు.బాస్టిల్ డేను ఫ్రెంచ్ రాచరిక ముగింపునకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆ తర్వాత చాలాకాలంపాటు రాచరికం కొనసాగినా వాటి అధికారాలు తగ్గించబడ్డాయి.
1789 జులై 14న(Bastille in 1789) ఫ్రెంచ్ విప్లవం(French Revolution)లో భాగంగా వేలాదిమంది ఖైదీలు బాస్టిల్ కోట ద్వారాలను బద్దలుకొట్టుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. ఇది ఫ్రాన్స్ స్వాతంత్ర్య పోరాటంలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తారు. కాబట్టి జులై 14, 1790 నుంచి జాతీయ దినోత్సవంగా ఫ్రాన్స్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. దాన్ని బాస్టిల్ డేగా లేక లేక ఫేట్ నేషనల్ ఫ్రాంకైస్‌గా పరిగణిస్తున్నారు. ఖైదీలు బాస్టిల్ కారాగారం నుంచి బయటకు రావడమే కాకుండా కోటలో ఉన్న గన్‌పౌడర్, ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పోరాటంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నారు. తర్వాతి కాలంలో బాస్టిల్‌ను ధ్వంసం చేశారు. బాస్టిల్ డే ఫ్రెంచ్ రాజకీయ, సామాజిక జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఫ్రాన్స్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఆలోచన(ideas of democracy)లకు బీజం వేసింది.
"లిబర్టీ, ఈగలైట్, ఫ్రాటర్నిటీ" ((Liberty, Equality, Fraternity)) అనే నినాదంతో ప్రపంచానికి ప్రజస్వామ్య మార్గాన్ని చూపింది. ఫ్రాన్స్ దేశీయులు బాస్టిల్ డేను బాణా సంచా పేల్చి, ఇతరత్రా కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాలను తిలకించడానికే నైస్ నగరంలో ప్రజలు పెద్ద యెత్తున గుమికూడుతారు. డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. సుదీర్ఘ సైనిక కవాతు కూడా నిర్వహిస్తారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో బాస్టిల్ డే వేడుకలకు హాజరయ్యారు. భారత సైనికులు కూడా ఈ వేడుకల్లో కవాతు చేశారు. అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్ సింగ్, నికోలస్ సర్కోజీ ఈ కవాతును వీక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com