షరియా చట్టాలు అంటే ఏమిటి?.. తాలిబన్లకి ఆఫ్గానీలు ఎందుకు భయపడుతున్నారు?

షరియా చట్టాలు అంటే ఏమిటి?.. తాలిబన్లకి ఆఫ్గానీలు ఎందుకు భయపడుతున్నారు?
shariah Law : 20 ఏళ్లుగా అంతోఇంతో అభివృద్ధి చెందిన ఆఫ్గనిస్తాన్‌‌ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ తాలిబన్లు పాలన కొనసాగనుంది.

shariah Law : 20 ఏళ్లుగా అంతోఇంతో అభివృద్ధి చెందిన ఆఫ్గనిస్తాన్‌‌ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ తాలిబన్లు పాలన కొనసాగనుంది. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్గాన్ వెళ్ళడంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకి తరలి వెళ్తున్నారు. ఇందుకు కారణం తాలిబన్లు తమ పాలనలో మళ్ళీ షరియా చట్టాలను అమలు చేస్తారనే భయం.. ఇంతకీ ఈ షరియా చట్టాలేంటి.. అందులో ఏం ఏం ఉన్నాయి.

గతంలో అంటే 1996-2001 మధ్యకాలంలో కూడా ఆఫ్గనిస్తాన్ గడ్డపై తాలిబన్లు రాజ్యమేలారు. ఆ సమయంలో షరియా(ఇస్లామిక్ చట్టం) అమలు చేశారు. త‌ప్పు చేసిన వారికి ష‌రియా చ‌ట్టం ప్రకారం శిక్షలు విధిస్తుంటారు. ఈ శిక్షలు చాలా క‌ఠినంగా ఉంటాయి. ఒక్కోసారి ఆ శిక్షలు తలుచుకుంటేనే ప్రాణం పోతుంది. ముందుగా షరియా అంటే మార్గం అని అర్ధం. ఇది అరబ్బీ పదం నుంచి ఉద్భవించింది. ముస్లింలందరూ పాటించాల్సిన ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక ప్రవర్తనకు సంబంధించిన పాలనా సూత్రాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది

గతంలో ఆఫ్గనిస్తాన్ పాలించిన తాలిబన్లు హంతకులను, అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ పురుషులను బహిరంగంగా తలలు నరకడం లేదా ఉరితీయడం వంటివి చేశారు. అంతేకాకుండా దొంగతనాలకి పాల్పడితే కాళ్ళు చేతులు నరికారు. కొన్ని సార్లు అయితే మొదలు హెచ్చరించి ఆ తర్వాత మళ్ళీ అదే పని చేస్తే చాలా క‌ఠినంగా శిక్షించేవారు. వ్యభిచారం లేదా వ్యభిచారంలో పాల్గొన్న వ్యక్తులకి తప్పనిసరిగా 100 కోరాడ దెబ్బలు.. ఇక అవివాహితులైతే వారిని ఏడాది పాటు బహిష్కరణ లేదా వివాహం చేసుకుంటే రాళ్లతో కొట్టి చంపాలి.

తాలిబన్లు చట్టాల ప్రకారం స్త్రీలకి బురఖాలు, పురుషులకి గడ్డాలు తప్పనిసరి. పదేళ్ళు పై బడిన వారు బాలికలు ఎవ్వరు కూడా బడులకి వెళ్ళకూడదు. అంతేకాకుండా సంగీతం, టీవీ, సినిమాలు నిషేధం.. మహిళలు బయటకు వెళ్ళాలంటే మగవారి తోడు తప్పనిసరి. ఎక్కడ ఏ విద్య అయిన ఇస్లామిక్ షరియా చట్టాలకి లోబడి ఉండాలి. ప్రతి శుక్రవారం ప్రజలు చేసుకునే పార్టీలు అక్కడ నిషిద్దం. అందరి కళ్లముందూ హింసించండం వంటి దారుణాలు చోటుచేసుకోవడం, మళ్ళీ తాలిబన్లు అధికారంలోకి రావడంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకి వలస వెళ్తున్నారు.

అయితే తాలిబన్లు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లుగా ప్రకటించారు. పూర్తి విశ్వాసంతో ఇక్కడ జీవించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి తమ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. తామేమీ పగ తీర్చుకోమని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story