Toshakhana: అసలు తోషాఖానా కేసు అంటే..

Toshakhana: అసలు తోషాఖానా కేసు అంటే..
ఒక్క ఇమ్రాన్ ఖానే కాదు ఇంకా ఎందరో…ఎంతెంతో..

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో దోషి అని ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష పాకిస్తాన్ రూపాయల జరిమానాతో పాటు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది.

అయితే ఇంతకీ తోషాఖానా కేసు అంటే ఏంటో తెలుసా.. అసలు ఈ కేసు మొదటిసారి గతేడాది బయటపడింది. విదేశీ నేతలు, అధికారుల నుంచి పాక్‌ అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు, సైనికాధికారులకు లభించిన బహుమతులను భద్రపరిచే ప్రభుత్వ ఖజానాను తోషాఖానా అంటారు. ఎవరు ఏ విలువైన వస్తువును స్వీకరించినా దానిని ఇంటికి తీసుకు వెళ్లకుండా ఇక్కడ అప్పగించాల్సిందే. ఒక వేళ ఆ వస్తువు బాగా నచ్చి తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటే తగిన ధర చెల్లించాలి. ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన 58 బహుమతులు లభించాయి. వీటిలో చాలా వస్తువులను ఆయన తన దగ్గరే ఉంచుకున్నారని.. కొన్నింటికే నామమాత్ర ధర చెల్లించారని అభియోగం. కొన్నింటిని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆదాయ వివరాలను ఎన్నిక ప్రమాణ పత్రంలో చూపించలేదని, ఇది అవినీతేనంటూ పాక్‌ ఎన్నికల సంఘం. గతేడాది అక్టోబరులో ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. ఫిర్యాదు కూడా చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడు శిక్ష పడింది.

తోషాఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ అవినీతి చిట్టా అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక డేటా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో 38లక్షల పాకిస్తానీ రూపాయల విలువ గల గ్రాఫ్ వాచ్‌తో సహా ఐదు ఖరీదైన చేతి గడియారాలు, వాటి ప్రస్తుత ధర సుమారు 11 లక్షలు కాగా దానికి రెండు లక్షల పాకిస్తాన్ రూపాయల చెల్లించి ఇమ్రాన్ ఖాన్ ఈ బహుమతులను తన వద్దే ఉంచుకున్నారు. అలాగే సెప్టెంబరు 2018లో ఖాన్ 8.55 కోట్ల పాకిస్తాన్ రూపాయల విలువైన గ్రాఫ్ చేతి గడియారం, 56 లక్షల విలువైన ఒక జత కఫ్‌లింక్‌లు, 15 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన పెన్ను, 87 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరాలను కేవలం 20 లక్షల పాకిస్తాన్ రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారట. ఇక వాచీల సంగతి అడగక్కరలేదు..ఇక ఆయన భార్య కూడా నెక్లెస్ లు, బ్రాస్లెట్ లు, ఉంగరాలు, ఇలా కోట్ల విలువైన బహుమతులను అసలు ప్రభుత్వానికి చెప్పకుండానే ఉంచేశారు.


ఈ సందర్భం లోనే 2002 నుంచి 2022 మధ్య దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఫెడరల్ క్యాబినెట్ సభ్యులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ జనరల్‌లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతో సహా ప్రభుత్వ కార్యాలయ హోల్డర్‌లు తమ వద్ద ఉంచుకున్న విదేశీ బహుమతుల వివరాలను పాకిస్తాన్ బహిరంగపరిచింది. అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, షౌకత్ అజీజ్, యూసుఫ్ రజా గిలానీ, షాహిద్ ఖాకాన్ అబ్బాసీ, రాజా పర్వైజ్ అష్రఫ్, జఫరుల్లా ఖాన్ జమాలీ, మాజీ అధ్యక్షులు తోషాఖానా బహుమతుల ద్వారా లబ్ది పొందిన వారిలో ఉన్నారు. ఆసిఫ్ అలీ జర్దారీ, పర్వేజ్ ముషారఫ్ వంటి ఇతర అగ్ర రాజకీయ నాయకులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story