శానిటైజర్ యమ డేంజర్.. కాలిపోతున్న కారు

డ్రైవింగ్ చేస్తూ సిగరెట్ తాగడం ప్యాషన్ అయిపోయింది. అదే అతగాడి కొంప ముంచింది. కరోనా కాలం చీటికి మాటికి ఇంట్లో ఉంటే చేతులు కడుక్కోవడం, బయటకి వెళ్లే శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం పరిపాటి అయిపోయింది.
అదే పని చేశాడు అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన ఓ వ్యక్తి. కారులో కూర్చుని చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నాడు, ఆనక సిగరెట్ వెలిగించాడు ఇంకే ముంది కళ్లముందే కారులో నుంచి మంటలు, వెంటనే అప్రమత్తమయ్యాడు కారు డోర్ తీసి బయటకు దూకేశాడు. స్వల్ప గాయాలతో బయట పడ్డా కళ్లముందే కారు తగలబడిపోతుంటే ఉసూరుమంటూ చూస్తుండి పోయాడు.
రాక్‌విల్లేలోని ఫెడరల్ ప్లాజా షాపింగ్ సెంటర్‌లో సాయంత్రం 5:30 గంటలకు మంటలు చెలరేగాయి.
సిగరెట్ తాగేటప్పుడు డ్రైవర్ హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాడు అని మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ ప్రతినిధి వివరించారు.
అదృష్టం కొద్దీ ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లేకపోతే అతడు కారుతో పాటు కాలిపోయేవాడని స్థానికులు అభిప్రాయపడ్డారు.
చాలా హ్యాండ్ శానిటైజర్లలో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఇది మండుతుంది. దీన్ని సక్రమంగా ఉపయోగించకపోతే మండుతుంది.
మెకానికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించడం గురించి ఒక హెచ్చరికను జారీ చేసింది.
హ్యాండ్ శానిటైజర్లను సురక్షితంగా ఉపయోగించడం గురించి తెలుసుకోవలసిన నాలుగు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఎలక్ట్రికల్ టూల్స్ మరియు పరికరాలను తాకే ముందు శానిటైజర్ వాడినా పూర్తిగా ఆరిపోయిన తరువాత వాటిని పట్టుకోవాలి.
మంటలు, అధిక వేడి ప్రాంతాల నుండి చేతి శానిటైజర్‌ను దూరంగా ఉంచండి.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించని హ్యాండ్ శానిటైజర్లను వాడకపోవడమే మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com