Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై పరుష పదం ఉపయోగించిన కరోలిన్ లీవిట్..

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సహనం కోల్పోయారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నోటికి పని చెప్పారు. బుడాపెస్ట్‌లో ట్రంప్-పుతిన్ భేటీని ఎవరు నిర్ణయించారంటూ ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగాడు. అంతే వ్యక్తిగత కోపమో.. లేదంటే ప్రెస్టేషనో తెలియదు గానీ బూతు పదం ఉపయోగించారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తు్న్నారు. ఇప్పటికే పలుమార్లు జెలెన్‌స్కీ, పుతిన్‌తో చర్చలు జరిపారు. మరోసారి హంగేరీ వేదికగా పుతిన్‌ను ట్రంప్ కలవబోతున్నారు. ఇదే అంశంపై వైట్‌హౌస్‌లో జరుగుతున్న ప్రెస్‌మీట్‌లో కరోలిన్ లీవిట్‌ను ఒక రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ.. ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశాన్ని బుడాపెస్ట్‌లో ఎవరు ఏర్పాటు చేశారని అడిగాడు. వెంటనే కరోలిన్ లీవిట్ బదులిస్తూ ‘మీ అమ్మ నిర్ణయించింది’ అంటూ చిందులేశారు. ఈ సందర్భంగా హఫింగ్టన్ పోస్ట్ రిపోర్టర్‌పై మండిపడింది. తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం చేసింది. ‘‘వామపక్ష వాది’’ అని అభివర్ణించింది.
తర్వాత ఇదే అంశంపై లీవిట్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది. ‘‘హఫింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ వాస్తవాలపై ఆసక్తి ఉన్న జర్నలిస్ట్ కాదని.. అతడు వామపక్ష వాది అని.. సంవత్సరాలుగా ట్రంప్‌పై దాడి చేస్తూనే ఉన్నాడు. డెమొక్రాట్ మద్దతుదారుడు.’ అని రాసుకొచ్చింది. కొంతమంది ఆ వృత్తికి అపచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు ఆ మధ్య అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. కానీ సత్ ఫలితాన్ని ఇవ్వలేదు. మరోసారి బుడాపెస్ట్‌లో ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అయితే ఇంకా తేదీని వైట్ హౌస్ నిర్ధారించలేదు. రెండు వారాల్లో బుడాపెస్ట్‌లో జరిగే అవకాశం ఉంది. ఈసారి ఎలాగైనా పుతిన్‌ను ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే గత వారం వాషింగ్టన్‌లో ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలిశారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగినట్లుగా తెలుస్తోంది. పుతిన్ పెట్టిన షరతులపై జెలెన్‌స్కీని ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీ తర్వాత జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. సమావేశం సానుకూలంగా జరిగినట్లుగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com