Vladmir Putin : ప్రేయసిని రహస్యంగా దాచిపెట్టిన పుతిన్.. ఇంతకీ ఎవరీ అలీనా కబుయేవా?

Vladmir Putin :  ప్రేయసిని రహస్యంగా దాచిపెట్టిన పుతిన్.. ఇంతకీ ఎవరీ అలీనా కబుయేవా?
Vladmir Putin : ఈ యుద్ద సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబాన్ని సురక్షితంగా అట్లాయ్ పర్వతాల వద్ద అణుబంకర్లలలో భద్రంగా ఉంచినట్టుగా తెలుస్తోంది.

Vladmir Putin : ఇంకా ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తోంది రష్యా.. ఈ యుద్ద సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబాన్ని సురక్షితంగా అట్లాయ్ పర్వతాల వద్ద అణుబంకర్లలలో భద్రంగా ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక స్విట్జర్లాండ్ లో ఉంటున్న తన ప్రేయసి అలీనా కబుయేవాను, నలుగురు పిల్లల్ని స్విన్ కొండ ప్రాంతంలో షాలే అనే చెక్క కట్టడంలో ఉంచినట్లు సమాచారం.

ఇంతకీ ఎవరీ అలీనా కబుయేవా?

38 ఏళ్ల అలీనా కబుయేవా రష్యన్ రాజకీయవేత్త ... అంతకుముందు ఆమె ఓ జిమ్నాస్ట్... 1983లో జన్మించిన ఆమె మూడు సంవత్సరాల వయసు నుంచే జిమ్నాస్ట్ లో శిక్షణ తీసుకుంది. 15 సంవత్సరాల వయస్సులో, ఆమె పోర్చుగల్‌లో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో ఆమె రష్యన్ జట్టులో అతి పిన్న వయస్కురాలు కావడం విశేషం. 1999 రెండోసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ను గెలుచుకుంది. అలీనా కబుయేవా మొత్తం రెండు ఒలింపిక్ పతకాలు, 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు మరియు 21 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకుంది.


కబుయేవా మరియు ఆమె తోటి రష్యన్ జిమ్నాస్ట్ ఇరినా చష్చినా ఇద్దరూ 2001లో డోపింగ్‌కు పాల్పడ్డారు, దీనితో వారిద్దరూ రెండేళ్లపాటు ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండా అనర్హులు అయ్యారు. 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2007,14లో యునైటెడ్ రష్యా పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో పుతిన్‌తో కబయేవాకు సాన్నిహిత్యం ఏర్పడింది. తొలిసారిగా 2008లో పుతిన్-కబయేవా మధ్య సంబంధం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.

పుతిన్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కబయేవాని పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. కానీ పుతిన్ దీనిని పలుమార్లు ఖండించారు. ఇక కబయేవాకు 2004లో డేవిడ్ ముసెలియాని అనే పోలీస్ అధికారితో నిశ్చితార్థం జరిగింది. 2005లో వీరిద్దరూ విడిపోయారు. కబయేవా, పుతిన్‌లకి కలిసి నలుగురు పిల్లలను కలిగి ఉన్నారని, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు స్విట్జర్లాండ్‌లో పుట్టారని, వీరికి పాస్‌పోర్ట్ ఉందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story