Malala Yousafzai : మలాలా యూసఫ్‌‌జాయ్‌‌ భర్త ఎవరు.. అతను ఏం చేస్తాడు?

Malala Yousafzai : మలాలా యూసఫ్‌‌జాయ్‌‌ భర్త ఎవరు.. అతను ఏం చేస్తాడు?
Malala Yousafzai : అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్‌‌జాయ్‌‌కు పేరుంది. అయితే ఇప్పుడామె వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Malala Yousafzai : అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్‌‌జాయ్‌‌కు పేరుంది. అయితే ఇప్పుడామె వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అస‌ర్ మాలిక్‌ తో ఆమె వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో గల తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. అయితే ఆమె భర్త ఎవరు,ఏం చేస్తాడు అని నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు. మ‌లాలా భ‌ర్త అస‌ర్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై ప‌ర్ఫార్మెన్స్ సెంట‌ర్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా చేస్తున్నాడు.

గత ఏడాది ఆయన ఉద్యోగంలో చేరాడు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ఆడుతున్న ముల్తాన్ సుల్తాన్ జ‌ట్టుకు ఆప‌రేష‌న‌ల్ మేనేజ‌ర్‌గా సేవలందించాడు. లాహోర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ నుంచి 2012లో ఆర్థిక‌శాస్త్రం, రాజ‌నీతి శాస్త్రం నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీ ప‌ట్టా పొందారు.

కాగా వీరికి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.


Tags

Next Story