WHO: కోవిడ్ మరణాలు 30 లక్షలు.. ఆరోగ్య సంస్థ అంచనా..

WHO: కోవిడ్ మరణాలు 30 లక్షలు.. ఆరోగ్య సంస్థ అంచనా..
కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వార్తల్లో చూపేది కొన్నే.. అంతకు మించి మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

WHO: కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వార్తల్లో చూపేది కొన్నే.. అంతకు మించి మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. మృతుల గణన సవ్యంగా జరగడం లేదని పేర్కొంది.

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కనీసం 30 లక్షల మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుని ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు ఓ ప్రత్యేక నివేదికను డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం 2020 డిసెంబరు 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు, మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉన్నట్లు చూపింది.

వాస్తవానికి అంతకంటే కనీసం 12 లక్షల మరణాలు అధికంగా సంభవించి ఉండొచ్చు. చాలా దేశాల్లో కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో మరణించిన వారినే పరిగణనలోకి తీసుకున్నారు. టెస్టులకు ఇచ్చిన తరువాత ప్రాణాలు కోల్పోయిన వారిని లెక్కల్లోకి తీసుకోలేదు.

కోవిడ్ సంక్షోభం కారణంగా పరోక్షంగా కూడా చాలా మంది మృత్యువాత పడ్డారు. వాటిని కూడా లెక్కలోకి తీసుకోలేదు. సమాజంలో ఇంకా అసమానతలు నెలకొని ఉన్నాయని కోవిడ్ ఎత్తిచూపింది. మరోవైపు అన్ని దేశాలు డేటా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story