NeoCov : నియోకోవ్‌ ప్రమాదకరమా.. మనుషులకి వ్యాపిస్తుందా?

NeoCov :  నియోకోవ్‌ ప్రమాదకరమా.. మనుషులకి వ్యాపిస్తుందా?
NeoCov : ప్రపంచమంతా కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రస్తుతం సతమతమవుతుంటే.. చైనాలోని పుహాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు.

NeoCov : ప్రపంచమంతా కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రస్తుతం సతమతమవుతుంటే.. చైనాలోని పుహాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. దక్షిణాప్రియాలో నియో కోవ్‌ అనే కొత్త రకం వేరియంట్‌ బయట పడినట్లు వెల్లడించారు. ఈ నియోకోవ్‌ వైరస్‌ భిన్నమైనది, అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ శరీరంలోని యాంటీబాడీలు, వ్యాక్సిన్లను సైతం తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు. డోసులు, బూస్టర్‌ డోసులేం పనిచేయకపోవచ్చని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. 2012, 2015లో మెర్స్‌ - కోవ్‌ కారణంగా వందల మంది చనిపోయారు. ఈ నియోకోవ్‌తోనూ అదే స్థాయిలో మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు.

విచిత్రంగా నియోకోవ్‌ కూడా దక్షిణాఫ్రికాలోనే పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా దక్షిణాఫ్రికా నుంచే ప్రపంచం మొత్తానికి పాకింది. కొత్తగా పుట్టుకొచ్చిన నియోకోవ్‌కు.. ఒమిక్రాన్‌ లక్షణాలే ఉన్నాయి. అంటే, అత్యంత వేగంగా వ్యాపించగల లక్షణం ఉంటుందని, కాకపోతే ఒమిక్రాన్‌ అంత సాఫ్ట్ వైరస్‌ మాత్రం కాదని హెచ్చరిస్తున్నారు. నియోకోవ్‌ వైరస్ కారణంగా మరణాల రేటు అధికంగా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

నియోకోవ్‌ వైరస్‌ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో కనిపించిందని.. వూహాన్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కూడా కరోనా వైరస్‌ వేరియంటేనని చైనా శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ విషయాన్ని రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్‌ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కొత్త వైరస్‌ జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతుందని చెబుతున్నారు. కాకపోతే, ఈ వైరస్‌లో జరిగే మ్యుటేషన్ కారణంగా జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని సైంటిస్టుల రీసెర్చ్‌లో తేలింది. ఏది ఏమైనా కోత్త కరోనా వేరియంట్‌ రావడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.

నియో కోవ్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో నియో కోవ్‌ ఉన్నట్టు వుహాన్‌ పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందని.. అయితే ఈ వైరస్‌ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని WHO పేర్కొన్నట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story