Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్‌కి తీవ్ర అస్వస్థత ?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది.
ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్‌లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు.
1989లో ఇరాన్ సుప్రీం లీడర్ రుహోల్లా ఖొమేనీ మృతితో ఆయన వారసుడిగా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనారోగ్యం బారినపడిన ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వారసుడెవరనే విషయమై చర్చ జరుగుతోంది. ఖమేనీ వారసుడిగా భావించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా (55) ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇజ్రాయేల్ ప్రతీకార దాడులకు ఎలా స్పందించాలనే దానిపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. దీనిపై ఇరాన్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, తాము ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయకూడదని భావిస్తున్నట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. మిత్రపక్షాల శక్తి సన్నగిల్లడం, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినడం, ఖమేనీ ఆరోగ్యం విషమించడంతో వారసుడి ఎంపిక వంటి ఇబ్బందులతో ఇరాన్ డైలామాలో ఉంది. ఈ క్రమంలో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణను సూచిస్తూ ఇరాన్ సైన్యం శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకునే హక్కు దానికి ఉందని చెబుతూనే.. దీనిపై ఓ మార్గాన్ని కనుగొనడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆ ప్రకటనలో తెలిపింది. తమపై దాడులకు చాలా తేలికైన వార్ హెడ్‌లను మోసుకెళ్లే స్టాండాఫ్ క్షిపణులను ఉపయోగించిందని పేర్కొంది. ఈ దాడుల్లో తమ సైనిక రాడార్ స్థావరాలు దెబ్బతిన్నాయని, అయితే కొన్ని ఇప్పటికే మరమ్మతులో ఉన్నాయని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com