Wildfire : చిలీలో కార్చిచ్చు.. 13మంది మృతి

Wildfire : చిలీలో కార్చిచ్చు.. 13మంది మృతి
చిలీ రాజధాని శాంటిగయోకు 500 కిలొమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది


లాటిన్ అమెరికాలోని చిలీ అడవులలో మంటలు అంటుకున్నాయి. ఇప్పటి వరకు 13మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చిలీ రాజధాని శాంటిగయోకు 500 కిలొమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది. 150కి పైగా ప్రాంతాల్లో మంటలు అంటుకున్నట్లుగా సమాచారం. వందలాది ఇళ్ళతో పాటు, 14వేల హెక్టార్ల అటవీ ప్రాంతం కాలి బూడిదైపోయింది. దీనికి తోడు వేడి గాలులు వలన మంటలు మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.

శుక్రవారం మధ్యహ్నం నాటికి 151 అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించినట్లు తెలిపారు అధికారులు. అందులోని 65 ప్రాంతాల్లో మంటలు అదుపులో ఉన్నట్లు చెప్పారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ మీడియాతో మాట్లాడారు. బాధిత ప్రాంతానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. మంటలను అదుపు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పారు. మంటలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story