US elections: నేనే అధ్యక్షుడినైతే ట్రంప్‌కు క్షమాభిక్ష ..

US elections: నేనే అధ్యక్షుడినైతే ట్రంప్‌కు క్షమాభిక్ష ..
US elections: నేనే అధ్యక్షుడినైతే ట్రంప్‌కు క్షమాభిక్ష ..

తాను అమెరికా అధ్యక్షుడినైతే.. మాజీ ప్రెసిడెంట్​ డోనాల్డ్​ ట్రంప్​ను క్షమిస్తానని భారతీయ అమెరిన్, అధ్యక్ష ఆశావహుడు వివేక్​ రామస్వామి చెప్పారు. ఓ టీవీ షోలో తన అభిప్రాయాలు వెల్లడించిన వివేక్ రామస్వామి ట్రంప్ అయినా తాను అయినా ఫస్ట్ అమెరికా అన్న దానికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అలా చేస్తే దేశం మళ్లీ ఏకం కావడానికి దోహదపడుతుందని చెప్పారు. తదుపరి దేశాధ్యక్షుడిగా ఇది తన ప్రాధాన్య అంశం కాకపోయినప్పటికీ దేశం ముందుకు సాగడానికి అవసరమని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలోకి దిగేందుకు నామినేషన్ కోసం భారత సంతతికి చెందన వివేక్ రామస్వామి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పొటీ పడుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ గురించి మాట్లాడిన మొదటి రోజే వివేక్ అందరిని ఆకర్షించారు. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ పార్టీ నామినేషన్ ట్రంప్ కు దక్కితే తన పూర్తి మద్దతు ట్రంప్ కే ఉంటుందన్నారు.


చాలా విషయంలో ట్రంప్ ది తనది ఒకే విధమైన ఆలోచనా విధానమన్నారు. ఇక మొదటి నుంచి తనకు ట్రంప్ కంటే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ముఖ్యమని వివేక్ తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారికే తన ఓటు అని ప్రకటించారు. అయితే ఈ బాధ్యతలకు జో బైడెన్‌ సరికాదని తన ఉద్దేశ్యమని వివేక్ పేర్కొన్నారు. అంతేకాకుండా జో బైడెన్ తరువాత వచ్చే కమలా హారిస్ లేదా మరొకరో కూడా అధ్యక్ష పదవికి అర్హులు కాదన్నారు. దేశాన్ని ముందకు తీసుకు వెళ్లడానికి ఎవరు సమర్ధులో ఓటు వేసే ముందు ఆలోచించుకొని వారికి వేస్తానని వివేక్ పేర్కొ్న్నాడు. దేశంలో మళ్లీ స్ఫూర్తిని నింపాలని వివేక్ అన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం డొనాల్డ్ ట్రంప్ కంటే, రాజకీయాల కంటే కూడా ఎంతో పెద్దదని వివేక్ తెలిపారు.

గతనెలలో జరిగిన రిపబ్లికన్ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్​ తర్వాత వివేక్​కు ప్రజాదరణ పెరిగింది. సౌత్​ కరోలినా మాజీ గవర్నర్​ నిక్కీ హేలీతో పోటీపడి ప్రజలను ఆకట్టుకున్నారు. మరోవైపు ఇక వివేక్ తన ప్రభుత్వంలో గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడని ట్రంప్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్​కి, 'అతడి అమెరికా ఫస్ట్​' విధానాలకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న, ఏకైక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అశావహుడు వివేక్​ ఒక్కరే. అయితే నిజానికి ట్రంప్ కు తనుకు స్వల్ప విబేధాలు ఉన్నాయన్న విషయం వివేక్ ఒప్పుకున్నారు. పాలసీల విషయంలో తమ అభిప్రాయాలు ఒకటే అని కూడా వివేక్ తెలిపారు. దీంతో ట్రంప్ కు క్షమాభిక్ష పెడతా అన్న వివేక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story