Russia :రష్యా సఖలిన్ ద్వీపాన్ని ముంచేత్తిన మంచు తఫాను

రష్యాలోని తూర్పు సఖలిన్ ద్వీపాన్ని మంచు తఫాను ముంచేత్తింది. భారీగా కురిసిన హిమపాతం కారణంగా జనజీవనం స్తంభించింది. రహదారులు, భవనాలపై అడుగుల మేర మంచు పేరుకపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యవసర సరకులకు సైతం అక్కడి ప్రజలు బయటకి రాలేకపోతున్నారు.
రష్యాలోని తూర్పు సఖలిన్ ద్వీపాన్ని మంచుతుఫాను కప్పేసింది. విపరీతంగా కురుస్తున్న హిమపాతం వల్ల రహదారులు మూతపడ్డాయి. వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. పోలీసు వాహానాలు ,కార్లు దట్టమైన మంచులో కూరకొనిపోయి ముందుకు కదల్లేని స్థితిలో ఉన్నాయి. ఇతర వాహనాల సాయంతో వాటిని అధికారులు తీసుకెళ్తున్నారు. ప్రజలు తమ దగ్గర ఉన్న పనిముట్ల సాయంతో పరిసరాల్లోని మంచుని తొలగించి వారి రోజువారి కార్యక్రమాలను చేసుకుంటున్నారు. సఖలిన్ ద్వీపం నుంచి ప్రధాన భూభాగానికి మధ్య ఉండే ఫెర్రి క్రాసింగ్‌ను అధికారులు మూసివేశారు.
రోడ్లపై, వాహానాలపై మంచు దట్టంగా కురవడంతో రవాణవ్యవస్థ స్తంభించిపోయింది. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నిత్యవసర సరకుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై, వాహనాలపై అడుగుల మేర కురిసిన మంచును అధికారులు భారీయంత్రాల సాయంతో తొలగిస్తు రోడ్లను రాకపోకలకు సిద్ధం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధుల భారీ హిమపాతం వల్ల బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మరికొంత మంది యువకులు భవనాలపై నుంచి మంచులోకి దూకుతూ ఆటలాడుకుంటున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com