America: మంచుతుఫాను విలయం.. చీకట్లో లక్షలాది ఇళ్లు..

America: మంచుతుఫాను విలయం.. చీకట్లో లక్షలాది ఇళ్లు..
వేలాది విమానాలు రద్దు...

అమెరికాలో శీతాకాలపు తుఫాను అలజడి సృష్టించింది. మిడ్‌వెస్ట్‌, దక్షిణ ప్రాంతాల్లో ఈ తుఫాను కారణంగా శుక్రవారం రెండు వేలకు పైగా విమానాలు రద్దవ్వగా, 5,604 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. పలు విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ను నిలిపివేశారు. వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. గత ఏడాది జూలై తర్వాత ఇంత భారీ స్థాయిలో విమానాలు రద్దు కావడం ఇదే ప్రథమం.

తుఫాను వల్ల గ్రేట్‌ లేక్స్‌, దక్షిణ ప్రాంతంలో సుమారు 2.5 లక్షల కుటుంబాలు అంధకారంలో చిక్కున్నాయి. అమెరికా తూర్పు ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్య పశ్చిమ ప్రాంతంలో మంచు తుఫాను ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..


కాగా, చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో 40 శాతం విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఇందులో 36 శాతం విమానాలు ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉండగా.. ఇక చికాగో మిడ్‌వేస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులతో పాటు పలు ఎయిర్‌పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్టు పేర్కొంటున్నాయి. ‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్‌‌లో ఇబ్బంది ఉండటంతో.. పెద్ద సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ కావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను దృష్టి పెట్టుకొని పెద్ద సంఖ్యలో విమానాలను క్యాన్సిల్ చేస్తుంది.

ఇక, తీవ్రమైన మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. తీవ్రమైన గాలులతో గ్రేట్ లేక్స్, సౌత్‌ ఏరియాలో సుమారు 2, 50,000 ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇల్లినాయిస్‌లో దాదాపు 97,000 మంది చీకటిలో ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాన్ యునైటెడ్ స్టేట్స్ తూర్పు భాగంలో వ్యాపించి ఉందని సీఎన్ఎన్ రిపోర్ట్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story