UK: యూకేలో ఇద్దరు సిక్కులపై దాడి

UK: యూకేలో ఇద్దరు సిక్కులపై దాడి
X
జాత్యహంకార ఘటనపై సర్వత్రా ఆగ్రహం

యూరప్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌ రైల్వేస్టేషన్‌ వెలుపల ఇద్దరు సిక్కులపై ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు. వారిని కిందపడేసి ఇష్టమున్నట్టు బాదారు. బాధిత సిక్కుల తలపాగాను తొలగించారు. తంతూ దుర్భాషలాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో విడుదల కావటంతో, ఘటనపై యూకే అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు టీనేజర్లుగా తెలిసింది. వీరిని బ్రిటిష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోలీస్‌ అరెస్టు చేసి, బెయిల్‌పై విడుదల చేసింది.

Tags

Next Story