అంతర్జాతీయం

ఆహా ఏమి అదృష్టం.. ప్లైట్ క్యాన్సిల్ అయింది.. రూ.7 కోట్లు గెలుచుకుంది..

ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోమంటారు పెద్దలు. ఒక్కోసారి ఆ మాటలు నిజమే అనిపిస్తాయి.

ఆహా ఏమి అదృష్టం.. ప్లైట్ క్యాన్సిల్ అయింది.. రూ.7 కోట్లు గెలుచుకుంది..
X

ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోమంటారు పెద్దలు. ఒక్కోసారి ఆ మాటలు నిజమే అనిపిస్తాయి. కాకపోతే ఏమిటి.. ప్లైట్ క్యాన్సిల్ అయింది.. ఏం చేయాలో ఉబుసు పోలేదు.. ఏ పల్లీలో, చిప్స్ పాకెట్టో తెచ్చుకుని కాలక్షేపం చేయకుండా లాటరీ టికెట్ కొన్నది.. అందుకేనోయి నీ ఫ్లైట్ క్యాన్సిల్ చేయించానంటూ అదృష్టం తలుపు తట్టింది. లాటరీలో గెలుచుకున్న మొత్తం రూ.7 కోట్లని తెలిసి ఆమె గాల్లో తేలిపోతోంది.

మిస్సౌరీలోని కాన్సాస్ సిటీకి చెందిన ఏంజెలా కారవెల్లా (51), ఎయిర్‌పోర్టుకు వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసింది. ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక కనిపిస్తున్న షాపులోకి దూరింది. అవి ఇవీ చూస్తూ ఎందుకు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందో.. ఏదో వింత జరగబోతోందేమో.. సరే మునుపెన్నడూ లాటరీ టికెట్ కొన్లేదు.. ఇప్పుడు కొని చూద్దాం అని సరదాగా ఓ ట్రయిల్ వేసింది.

టాంపాకు తూర్పున ఉన్న బ్రాండన్‌లోని పబ్లిక్ సూపర్ మార్కెట్ నుండి కారవెల్ల USD లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఫ్లోరిడా లాటరీ స్క్రాచ్-ఆఫ్ టికెట్ నుండి 1 మిలియన్ డాలర్లు (రూ.7 కోట్లు) గెలుచుకున్న మిస్సౌరీ మహిళ అదృష్టం మారిపోయింది. USD 30 గేమ్ ఫిబ్రవరి 2020 లో ప్రారంభించబడింది. కారవెల్లాకు టికెట్‌ను విక్రయించినందుకు స్టోర్‌ యజమానికి USD నుంచి 2,000 బోనస్ కమీషన్ అందుతుంది.

Next Story

RELATED STORIES