31 సంవత్సరాలు కోమాలో ఉండి చివరకు..

31 సంవత్సరాలు కోమాలో ఉండి చివరకు..
1991వ సంవత్సరం.. క్రిస్మస్ రోజులు.. ఇటలీకి చెందిన మిరియం విసింటిన్ కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో మెదడుకు తీవ్ర గాయమైంది.

1991వ సంవత్సరం.. క్రిస్మస్ రోజులు.. ఇటలీకి చెందిన మిరియం విసింటిన్ కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో మెదడుకు తీవ్ర గాయమైంది.ఆ రోజు నుంచి విసింటిన్ 31 సంవత్సరాల పాటు కోమాలో ఉంది. మే 10శాన్ బస్సియానో ​​ఆసుపత్రిలో విసింటిన్ మరణించింది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడంతో రెండు నెలల క్రితం ఆమెను బస్సియానో ఆస్సత్రికి తరలించారు.

ప్రమాదానికి ఏడాదిన్నర ముందు ఆమె ఏంజెలో ఫరీనాను వివాహం చేసుకుంది. 33 సంవత్సరాల ఆమె భర్త ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి భార్యను చూసి వెళ్లేవాడు. ఏ రోజైనా కోమాలో నుంచి బయటపడుతుందేమో అని ఎదురుచూసేవాడు. "నేను ఆమె కోసం సంతోషంగా ఉన్నాను, తనకు దేవుడు 31 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. చివరకు ఆమె ప్రశాంతంగా కన్నుమూసింది. ఇప్పుడు స్వర్గంలో ఉంది," అని విసింటిన్ భర్త ఏంజెలో ఫరీనా అన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు మాకు వివాహం జరిగి ఏడాదిన్నర మాత్రమే.

మేము చాలా చిన్న వయస్సులో ఉన్నాము విధి ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఆమెకు ఇలా జరిగి ఉండకూడదు అని భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. విధి మమ్మల్ని ఇద్దరినీ విడదీసింది అని గద్గద స్వరంతో అన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుండి దాదాపు ప్రతిరోజూ ఫరీనా తన భార్యను చూసి వెళ్లేవాడు అని ఆస్పత్రి సిబ్బంది వివరించారు. ఇంత ప్రేమగా ఉన్న వ్యక్తులకు దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు అని సిబ్బంది తమలో తాము ముచ్చటించుకునేవారు.

ముస్సోలెంట్‌లోని ఒక డిస్కోలో కలుసుకుని ప్రేమలో పడ్డారు. 1990లో విసింటిన్, ఏంజెలో వివాహం చేసుకున్నారు. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో యాక్సిడెంట్ రూపంలో మృత్యువు విసింటిన్ ను కబళించింది.

Tags

Next Story