Srilanka : చాక్లెట్‌లో మనిషి వేలు

Srilanka : చాక్లెట్‌లో మనిషి వేలు
చాక్లెట్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు, దర్యాప్తు ప్రారంభం

చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం.. అందులోను కొంతమందికి ఫ్రూట్ అండ్ నట్స్ ఉన్నవి మరీనూ.. చిన్నారుల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్ ను ఎంజాయ్ చెయ్యని వాళ్ళు ఉండరు. పళ్లు పుచ్చిపోతాయని, ఇతర ఆరోగ్య సమస్యల వస్తాయని బలవంతంగా వీటిని ఆపుతారు గానీ లేదంటే రోజు తినడానికి పిల్లలేకాదు.. పెద్దలు కూడా సిద్ధమే.

అయితే ఇకపై తినేటప్పడు దానిపై మరింత శ్రద్ధ పెట్టండి ఎందుకు అంటే ఆశీర్వదించడానికి అనుకున్నారేమో కాదు శ్రీలంకకు చెందిన ఓ మహిళకు కలిగిన అనుభవమే మీకు కలగకుండా ఉండాలంటే. ఇంతకు ఆమెకు ఏమైందనే కదా డౌట్. అయితే ఈ వార్త చదవండి. శ్రీలకంకు మహియాంగనాయ హాస్పిటల్‌లోని ఈసీజీ విభాగంలో పనిచేసే ఓ మహిళ ఈ నెల 3న తన కెఫెటేరియా విభాగంలో స్థానికంగా తయారు చేసిన ఓ చాక్లెట్ కొనుక్కొని సగం తినేసింది. మిగిలిన దానిని తరువాత తినడానికి ఫ్రిజ్‌లో దాచుకుంది. శనివారం మిగిలిన చాక్లెట్ తినడం స్టార్ చేసింది. అయితే పళ్ల మధ్యలో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించింది. ముందు నట్స్ అని భావించింది. అయితే అది పళ్ల కింద ఇంకా నలగకపోవడంతో బయటకు తీసేసరికి అది ఒక వేలు. వెంటనే షాక్ కి గురయ్యింది..


వెంటనే తేరుకొని ఆమె మహియాంగనాయ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్లు ఆ ప్రాంతంలోని ఔట్‌లెట్లలో ఉన్న సదరు కంపెనీ చాక్లెట్‌లను, వేలిని స్వాధీనం చేసుకున్నారు. ఎందుకైనా మంచిది అని

ఆమెకు కూడా వైద్యం అందించారు. ఈ మేరకు సోమవారం స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్లు నివేదిక సమర్పించారు. అయితే చాక్లెట్‌లోని పదార్ధం మనిషి వేలిదా? శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉన్నందున కొలంబో లేబొరేటరీకి పంపిస్తామని తెలిపారు.

చాక్లెట్‌లో మనిషి వేలు కనిపించిందన్న సమాచారం వెలువడిన రోజే ఆ చాక్లెట్ కంపెనీ ప్రతినిధులు మహియాంగనాయ హెల్త్ ఆఫీసర్ వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఇంతకుముందు ఆహార పదార్థాలలో కీటకాలు వచ్చేవి. అయితే తినే పదార్థంలో మానవ అవయవం కనిపించడం ఇదే తొలిసారి అని శ్రీలంక ఆరోగ్య శాఖ స్థానిక అధికారులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story