Crime news: బావతో వివాహేతర సంబంధం, ఇద్దరూ కలిసి భర్తను ఎంత ప్లాన్‌గా చంపారంటే !

భర్తలను చంపుతున్న భార్యల కేసుల్లో మరో పేరు చేరింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తిని అతడి భార్య, లవర్ కలిసి కుట్రతో హత్య చేశారు. బాధితుడు కరణ్ దేవ్ గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, భార్య సుస్మితా దేవ్, ఆమె బావ రాహుల్ దేవ్ ఇద్దరు కలిసి కుట్ర పన్ని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. బాధితుడు కరణ్ దేవ్ కరెంట్ షాక్‌కు గురై మరణించాడని కట్టు కథ అల్లింది. చివరకు కరణ్ దేవ్ సోదరుడి అనుమానంతో, మృతదేహానికి పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ముందుగా సుస్మితా, రాహుల్ దేశ్ ,రాహుల్ తండ్రి పోస్టుమార్టాన్ని వ్యతిరేకించారు. దీంతో బాధితుడి కుటుంబీకుల అనుమానాలు ఎక్కువ అయ్యాయి. బాధితుడి వయసును దృష్టిలో పెట్టుకుని వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కరణ్ దేవ్‌ను ఎలా చంపాలని ఇద్దరు చర్చించుకున్న చాట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అతడికి మత్తు మందు ఇచ్చి, విద్యుత్ షాక్‌తో హత్య చేయాలని భయంకరమైన కుట్రకు ప్లాన్ రూపొందించినట్లు తేలింది.
భార్య డిన్నర్ సమయంలో అతడికి 15 నిద్ర మాత్రలు ఇచ్చి, అతను అపస్మారక స్థితిలోకి చేరుకునే వరకు వేచి ఉన్నారు. నిద్ర మాత్రలు వేసిన తర్వాత ఎంత సేపు తర్వాత మరణిస్తాడనే విషయాలనున గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తేలింది. బాధితుడు స్పృహ కోల్పోయి, ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరెంట్ షాక్ ఇవ్వాలని ఇద్దరూ చర్చించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు మరణించాడని చిత్రీకరించేందుకు ఇద్దరూ బాధితుడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్ట్ చేశారు. తన బావతో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com