ఉడికీ ఉడకని చేపని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తినేసరికి.. ఆమె కడుపులో

ఉడికీ ఉడకని చేపని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తినేసరికి.. ఆమె కడుపులో
అయిదురోజుల క్రితం కొని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి సుషీ (చేప) గుర్తొచ్చింది.

ఫ్రెష్‌గా ఎప్పుడు వండినవి అప్పుడు తినాలని చెబుతున్నా.. ఫ్రిజ్ ఉన్నది ఎందుకు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందనేగా అని ఒక్కసారే తెచ్చి ఫ్రిజ్‌లో తోసెయడం.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తినడం చేస్తుంటాం.. కానీ అలా నిల్వ ఉంచిన ఆహారం అనారోగ్యం అని డాక్టర్లు మొత్తుకుంటూనే ఉంటారు. చికాగోలో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లినికల్ అడ్జంక్ట్ ప్రొఫెసర్ మరియు డాక్టర్‌గా పనిచేస్తున్న యూట్యూబర్ చుబ్బే ఎమ్యు ఓ మహిళ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తింటే ఆమెకు ఏం జరిగిందీ వివరించారు. అరుదైన వైద్య కేసులను చర్చించడానికి చుబ్బే ఎమ్యు తన యూట్యూబ్ ఛానెల్‌ని ఉపయోగిస్తాడు. అతడు పోస్ట్ చేసిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.

34 ఏళ్ల జేసీ ఆఫీస్ నుంచి వస్తూ దారిలో తినడానికి ఏమైనా కొనాలనుకుంది. కానీ అంతలోనే తాను అయిదురోజుల క్రితం కొని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి సుషీ (చేప) గుర్తొచ్చింది. ఇంటికి వెళ్లి అది తినేసింది. అప్పుడు ఏం కాలేదు.. ఆ తరువాత ఏం కాలేదు. అనూహ్యంగా నాలుగు నెలల తరువాత ఆమెకి కడుపులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. హాస్పిటల్‌కి వెళ్లడానికి ఇష్టపడక అలానే ఇంట్లో ఉంది. నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర పట్టట్లేదు. కడుపులో గుడగుడలు ఆగట్లేదు.

ఓ రోజు రాత్రి ఆమె కాళ్లు, చేతులు కదల్లేదు. కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో భర్త జేసీని హాస్పిటల్‌కి తీస్కెళ్లాడు. వైద్యులు ఆమెకు బ్లెడ్ టెస్ట, యూరిన్ టెస్ట్ నిర్వహించగా, ఆమె కడుపులో వేలాదిగా టేప్ వార్మ్ (ఏలిక పాములు) గుడ్లు కనిపించాయి. దీంతో ఆమె కడుపులో టేప్ వార్మ్స్ పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇవి కడుపులో కనీసం 9 మీటర్ల వరకు పొడవు పెరుగుతాయని, వాటి వల్ల ఆమెకు కడుపులో ఏదో కదులుతున్నట్లు అనిపించిందని వైద్యులు తెలిపారు.

ఈ మధ్య బయట ఫుడ్ ఏమైనా తిన్నారా అని ప్రశ్నించిన డాక్టర్లకు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన సుషీ చేపను తిన్నానని చెప్పింది. అది పాడై వాసన వస్తున్నా దానిపై వెనిగర్ పోసి తినేశానని డాక్టర్లు అడిగితే చెప్పింది. ఈ ఆహారాన్ని తయారు చేసే చేపపై అనేక పరాన్న జీవులు ఉంటాయి. పైగా ఆ చేపను పూర్తిగా ఉడకనివ్వకుండా దాదాపు పచ్చిగానే తినేస్తారు. అలా తింటేనే రుచిగా ఉంటుందని భావిస్తారు చేపలను ఇష్టంగా తినేవారు.

అయితే జేసీ దాన్ని ఐదు రోజులు నిల్వ ఉంచి తినడం వల్ల అందులోని పరాన్న జీవులు యాక్టివ్‌గా మారి కడుపులోకి చేరాయి. ఫలితంగా ఆమె కడుపులో పొడవైన టేప్ వార్మ్‌లు పెరిగి అనారోగ్యానికి దారి తీసింది. పరాన్న జీవి శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ బీ12ను ఎక్కువగా ఇష్టపడుతుంది. అది పూర్తిగా శరీరానికి అందకుండా చేయడం వల్ల ఆమెలో పౌష్టికార లోపం తలెత్తి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసిందని వైద్యులు తెలిపారు.

ముఖ్యంగా ఆమె నరాలు, కణాల్లో అవి బ్లాకైనట్లు తెలుసుకున్నారు. ప్రజీక్వాంటెల్ అనే యాంటీ వార్మ్ ఔషదం ద్వారా ఆమెకు చికిత్స అందించినట్లు యూట్యూబర్ చుబ్బే ఎమ్యూ వెల్లడించారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తినేముందు ఎందుకైనా మంచిది ఒకటికి రెండు సార్లు ఆలోచించి తినడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story