అంతర్జాతీయం

Woman Marries Cat: పిచ్చి పీక్స్.. పెంపుడు జంతువుపై ప్రేమ.. పిల్లిని పెళ్లి

Woman Marries Cat: లండన్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ ఇటీవల తన పెంపుడు పిల్లిని వివాహం చేసుకుంది

Woman Marries Cat: పిచ్చి పీక్స్.. పెంపుడు జంతువుపై ప్రేమ.. పిల్లిని పెళ్లి
X

Woman marries Cat:పెంపుడు జంతువుల కోసం ప్రాణాలైనా ఇస్తామంటారు పెట్ లవర్స్. ఇంట్లో వాళ్లకంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.. దానికి ఏదైనా అయితే ఏ మాత్రం తట్టుకోలేరు. ఇంటి ఓనర్ పిల్లిని రానివ్వద్దన్నాడని ఏకంగా పెళ్లి చేసేసుకుంది బ్రిటన్ కు చెందిన ఓ మహిళ.

లండన్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ ఇటీవల తన పెంపుడు పిల్లిని వివాహం చేసుకుంది. ఇంటి ఓనర్ పెంపుడు జంతువులకు పర్మిషన్ లేదన్నాడు.. దాంతో నా పిల్లి లేకపోతే నేను లేను.. నా బుజ్జి పిల్లిని ఇంట్లోకి రానివ్వనంటావా.. ఉండు నీ పని చెప్తా అని పిల్లిని పెళ్లాడింది.

ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి ఏప్రిల్ 19న తన పెంపుడు జంతువును పెళ్లి చేసుకుంది. దీని ద్వారా తనకు "పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అలాగే పొందేందుకు కూడా ఏమీ లేదని చెప్పింది. తన పిల్లి పేరు ఇండియా అని, అది తన ప్రాణమని చెప్పింది. తనకు తన పిల్లలు ఎంత ముఖ్యమో పెంపుడు పిల్లి కూడా అంతే ముఖ్యమని తెలిపింది.

"ఇండియాని వివాహం చేసుకోవడం ద్వారా, మాదంతా ఒకే కుటుంబమని, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోలేమని ఓనర్ కి తెలియజేసింది. ఈ నెల ప్రారంభంలో, Ms హాడ్జ్ ఆమె పెంపుడు పిల్లిని లండన్‌లోని ఒక పార్కులో వివాహం చేసుకుంది.

వేడుక కోసం పెళ్లి దుస్తుల్లో తాను ముస్తాబై పిల్లిని కూడా అలంకరించింది. చట్టబద్ధంగా నియమించిన వ్యక్తితో సహా Ms హాడ్జ్ స్నేహితులు అందరూ చూస్తూండగా ఆమె ఇండియాను వివాహం చేసుకున్నట్లు ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు "నన్ను, నా ఇండియా నుంచి ఎవరూ వేరు చేయలేరని చెప్పింది.

నేను, నా ఇండియా లేకుండా జీవించలేను. ఇంతకు ముందు ఓసారి ఉన్న ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఎదురై రెండు హస్కీ కుక్కపిల్లలను వదిలేసుకోవలసి వచ్చిందని గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంది హాడ్జ్.. ఆ సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది.. అందుకే ఈసారి అలా జరక్కూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.. తన ముద్దుల పిల్లి తనతోనే ఉంటుందని, ఇక ఎవ్వరూ మమ్మల్ని విడదీయలేరని ఆనందం వ్యక్తం చేస్తోంది హాడ్జ్.

Next Story

RELATED STORIES