వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఎలన్ మస్క్..

ఇంటి నుండి పని అనేది అస్సలు కరెక్ట్ కాదు. చాలా చెత్త విషయం అని ఎలోన్ మస్క్ చెప్పారు.ఇంటి నుండి పని చేయడం నైతికంగా తప్పు. టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం అనే ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు.ఎలోన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో రిమోట్ ఎంప్లాయిమెంట్‌ను ఎంతగా వ్యతిరేకిస్తారో స్పష్టం చేశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు అని అన్నారు. ఆఫీసుకు వచ్చి పని చేయడం వల్ల ఉద్యోగులలో మరింత సహకారం ఉంటుంది. ఉత్పాదకత పెరుగుతుంది అని ఆయన అన్నారు. ప్రజలు శారీరకంగా పనిలో ఉన్నప్పుడు ఎక్కువ సాధిస్తారని ఆయన తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు.
"ఇంటి నుండి పని నైతికంగా తప్పు. “ప్రజలు కార్లకు సర్వీసింగ్ చేస్తున్నారు, ఇళ్లు నిర్మించడం, ఆహారాన్ని తయారు చేయడం, ప్రజలు వినియోగించే అన్ని వస్తువులను తయారు చేయడం వంటి వాటికి పని ప్రదేశానికి వెళ్లే చేయాలి. ఇంటి నుంచి చేయడానికి కుదరదు. ఇంటి నుండి ల్యాప్‌టాప్ ద్వారా పనిచేస్తే ఉత్పాదకత తగ్గిపోతుందని అన్నారు. కార్మికులు లేదా ఫుడ్ డెలివరీ వ్యక్తులు వంటి ఉద్యోగులకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని Tesla CEO పేర్కొన్నారు. టెక్ ఉద్యోగులను మస్క్ "లా-లా ల్యాండ్‌లో నివసిస్తున్న వారి''గా అభివర్ణించారు.
టెస్లా ఉద్యోగులు జూన్ 2022లో మస్క్ విధించిన కఠినమైన నిబంధనలకు లోబడి ఉన్నారు. వారిని తిరిగి పనికి రావాలని లేదా ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఆర్డర్ ప్రకారం ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు ఆన్-సైట్‌లో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగుల కోసం కఠినమైన రిటర్న్-టు-వర్క్ విధానాన్ని అమలు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com