వరల్డ్ వైడ్ గా మరోసారి పంజా విసురుతోన్న కరోనా.. రికార్డుస్థాయిలో కొత్త కేసులు

వరల్డ్ వైడ్ గా మరోసారి పంజా విసురుతోన్న కరోనా.. రికార్డుస్థాయిలో కొత్త కేసులు
గత కొద్దిరోజులుగా తగ్గు తుందనుకున్న కరోనా మమ్మారి... మరోసారి తన పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులునమోదయ్యాయి..

గత కొద్దిరోజులుగా తగ్గు తుందనుకున్న కరోనా మమ్మారి... మరోసారి తన పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులునమోదయ్యాయి. ఒక్క రోజులోనే 6లక్షల 57వేలకు పైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి అని WHO పేర్కొంది. సైటిస్టులు హెచ్చరించిన విధంగానే శీతాకాలంలో వైరస్ విస్తృతి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఒకే రోజులో అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లోఅత్యధికంగా యూరప్ దేశాలనుంచే నమోదైనట్లు WHO తెలిపింది. యూరప్ వ్యాప్తంగా 2.85 లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5కోట్ల 43లక్షల 28వేల 752 కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 13లక్షల 18వేల 278మంది కరోనా సోకి మరణించారు. 3కోట్ల 78లక్షల 71వేల 87మంది కరోనా మహ్మారి నుంచి కోలుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యంలో కేసులతోపాటు మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లకుపైగా కేసులు నమోదైతే.... కోటికిపైగా కేసులు ఒక్క అమెరికాలో నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో 1 కోటి 12లక్షల 26వేల 38 కరోనా కేసులు నమోదుకాగా.. 2లక్షల 51వేల 256మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో అగ్రదేశం అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో భారత్ నిలిచింది. ఇప్పటివరకు మనదేశంలో 88లక్షల 14వేల 902 కరోనా కేసులు నమోదుకాగా.. 1లక్ష 29వేల 674మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్రెజిల్ ల్లో ఇప్పటి వరకు 58 లక్షల 48వేల 959 కేసులు నమోదు కాగా.. లక్షా 65వేల 673 మంది వైరస్ సోకి ప్రాణాలు విడిచారు.

Tags

Read MoreRead Less
Next Story