World Population: 800ల కోట్లు దాటిన ప్రపంచ జనాభా..: ఐక్యరాజ్యసమితి

World Population: ప్రపంచ జనాభా మరో రికార్డు సృష్టించనుంది. ఇవాళ్టితో మరో మైలురాయిని చేరుకోనుంది. నేటితో ప్రపంచ జనాభా భూమి మీద 800ల కోట్లను దాటనుందని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. 48 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం.
గత 50 ఏళ్లలో మానవ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. అడవుల్లోని జంతువులు, పక్షులు, ఉభయచరాలు మాత్రం సరాసరిన మూడింట రెండొంతుల మేర తగ్గిపోయాయి. మన అవసరాల కోసం యథేచ్ఛగా వనాలను నరికేయడమే ఇందుకు కారణం. గత 60 ఏళ్లలో ప్రపంచ అటవీ విస్తీర్ణం 81.7 మిలియన్ హెక్టార్ల మేర తగ్గింది. మానవ చర్యల వల్ల భూమిపై మూడొంతుల ప్రాంతం, సాగరాల్లో రెండొంతులు భాగం మార్పులకు లోనైంది.
అయితే జనాభా పెరుగుదలతోపాటు.. ప్రజల సౌకర్యాలు.. ఆహార భద్రతపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఐక్యరాజ్యసమితి భావిస్తుంది. అయితే ప్రపంచ జనాభా ప్రకృతివనరులపై పడే భారం, రోజు రోజుకు పెరుగుతున్న భూ తాపం... ప్రకృతి విపత్తులు.. కరువులు, ఆహార,నీటి కొరత వంటి అంశాలు సవాలుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మానవాళి ఉన్నత మైన లక్ష్యాలతో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com