Highest temperature : ఎండల్లో రికార్డ్

ఈ సంవత్సరపు అత్యంత వేడి రోజును దాటేసాం. 2023 జులై 3వ తేదీ సోమవారం ప్రపంచంలో హీటెస్ట్ డే గా రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్రిడిక్షన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సగటు ప్రపంచ ఉష్షోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్ అంటే 62.62 ఫారెన్‌హీట్ కి చేరుకుంది. ఆగస్టు 2016 రికార్డును బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం దక్షిణ యూఎస్ ఎండల్లో మగ్గిపోతోంది. ఎండల వేడిని తట్టుకోలేక ఇళ్ల నుంచి బయకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. చైనాలో కూడా 35C అంటే 95 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఎండలు కొనసాగాయి. ఉత్తర ఆఫ్రికాలో కూడా 50C (122ఫారెన్‌హీట్ ) ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అంటార్కిటికాలో అయితే ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. అయినప్పటికీ అక్కడ అసాధారణం అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. అర్జెంటీనా దీవులలో కూడా జూలై ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది.
నిజానికి ఇదంతా పెద్ద కొత్తగా, గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు, తీవ్రంగా బాధపడాల్సిన విషయం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ మార్పు, ఎల్‌నినో దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఈ ఎల్ నినో వలన శీతాకాలాలు కూడా వెచ్చగా ఉంటాయి, వర్షం లేకుండా, వేసవి కాలం మరింత వేడిగా మారతాయి, రుతుపవనాలు కూడా బలహీనంగా ఉంటాయి. దురదృష్టవశాత్తుగా పెరుగుతున్న పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలతో పాడైపోతున్న వాతావరణంలో పెరిగిపోతున్న ఇది మొదటి దశగా చెబుతున్నారు.
మన దేశంలో కూడా ఈ వేసవిలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయి. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల. నిజానికి గత నెలలో దేశంలోని కొన్ని ప్రదేశాల్లో తుఫాన్ వచ్చింది. వరదలు కూడా వచ్చాయి. అయినా సరే వేడి గాలులు కొనసాగాయి.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఈ విధంగా పెరుగుతూ పోతే వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది. పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిజానికి ఇవన్నీ మనం చేసే తప్పులు వల్ల ఏర్పడిన సమస్యలుగానే చెప్తారు శాస్త్రవేత్తలు. గతంతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని క్లైమేట్ సెంట్రల్ తెలిపింది. ఇలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రతి విషయంలో ఎఫెక్ట్ పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోవాలని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com