World's Costliest Soap: ఈ సబ్బుతో స్నానం చేయాలంటే కోటీశ్వరులు అయ్యుండాలి!
World's Costliest Soap: సబ్బు అనేది మన నిత్యావసర వస్తువులలో ఒకటి. ప్రస్తుతం అన్నీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఈ సబ్బుతో స్నానం చేయాలంటే కోటీశ్వరులు అయ్యుండాలి అంటున్నాం అనుకోకండి. నిజంగానే ఆ సబ్బు ధర వింటే అంత ఖర్చుపెట్టి సబ్బును ఎవరు కొంటారు కోటీశ్వరులు తప్ప.. అని మీరు కూడా అంటారు. ప్రపంచంలో ఖరీదైన సబ్బు ధర లక్షల్లో అట. మరి అంత ఖర్చు పెట్టి కొనే అంత ఈ సబ్బులో ఏముంది..
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సబ్బు తయారీ 2013లో మొదలయ్యింది. 15వ శతాబ్దం నుండి ఈ రకమైన సబ్బులను ఉపయోగించేవారట. అయితే బాడర్ హసీన్ అండ్ సన్స్ కంపెనీ వీటి ప్రొడక్షన్‌ను పెంచి మళ్లీ వీటిని వాడకంలోకి తీసుకొచ్చింది. 'ఖాన్ అల్ సబౌన్' పేరుతో ఈ సబ్బులు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ముందుగా ఈ సబ్బును ప్రమోట్ చేయడం కోసం దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చారు హసీన్ అండ్ సన్స్.
నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిన హసీన్ అండ్ సన్స్.. ఖరీదైన సబ్బును లాంచ్ చేయగానే చాలామంది కోటీశ్వరులు ఈ సబ్బును కొనడానికి ఆసక్తి చూపించారు. కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్మే ఈ ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.
కేవలం నేచురల్‌గా తయారు చేస్తేనే సబ్బుకు ఇంత ధర ఉంటుందా అనుకుంటే పొరపాటే. దీని తయారులో బంగారు, వజ్రం కూడా కలుపుతారు కాబట్టే దీని ధర లక్షల్లో ఉంది. ఖాన్ అల్ సబౌన్ సబ్బు తయారు చేసేటప్పుడు 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌ను ఇందులో కలుపుతారట. అందుకే ఒక్క ఖాన్ అల్ సబౌన్ ధర 2 లక్షల ఏడు వేల రూపాయలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com