అంతర్జాతీయం

అమ్మో నీళ్లు.. అందుకే స్నానం చేసి 65 ఏళ్లు

గత 65 ఏళ్లుగా అతడు స్నానం చేసి ఎరుగడట. అందుకే అతడిని ప్రపంచంలోని డర్టియెస్ట్ మ్యాన్ అని పిలుస్తున్నారు.

అమ్మో నీళ్లు.. అందుకే స్నానం చేసి 65 ఏళ్లు
X

కొన్ని వినడానికి చాలా వింతగా ఉంటాయి. అందుకే అవి వార్తలవుతాయి. కొందరికి నీళ్లను చూస్తే భయం, నీళ్లలో అడుగు పెట్టాలంటే భయం.. మరీ స్నానం చేయాలంటే కూడా భయమంటే ఇంకే చెప్పాలి. ఇరానియన్ ఎడారిలో నివసించే 83 ఏళ్ల అమౌ హాజీకి కూడా నీళ్లంటే చాలా భయం.

గత 65 ఏళ్లుగా అతడు స్నానం చేసి ఎరుగడట. అందుకే అతడిని ప్రపంచంలోని డర్టియెస్ట్ మ్యాన్ అని పిలుస్తున్నారు. చన్నీళ్లతో తల స్నానం చేస్తే జలుబు చేస్తుంది.. లేదంటే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందని అంటారు. కానీ ఇతడికి స్నానం చేస్తే కూడా జలుబు చేస్తుందట. అందుకే స్నానం అనే మాటను మర్చిపోయి 65 ఏళ్లయిందని అంటున్నాడు.

స్నానం చేస్తే అనారోగ్యానికి గురవుతానని, అందుకే ఆరు దశాబ్దాలుగా స్నానం చేయకపోవటానికి కారణం అదేనని అంటున్నాడు. అమౌ ఇరానియన్ ఎడారిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతడిని ప్రేమగా పలకరించే వారే లేరు. కుళ్ళిన మాంసాన్ని ఎంతో ఇష్టంగా తినే అమౌ నాన్-వెజ్ తినడానికి ఇష్టపడతాడు కాని ఇంట్లో వండిన ఆహారాన్ని అతను ఇష్టపడడు. తాను మురికిగా ఉండడం వల్లే ఇంతకాలం బతికి ఉన్నానని అంటున్నాడు.

అమౌ కు ఇల్లు లేదు. అతను గ్రామం వెలుపల ఎడారిలో ఉన్న గుహలలో నివసిస్తున్నాడు. గ్రామస్తులు అతని కోసం ఒక గుడిసెను నిర్మించినట్లు తెలిసింది కాని అతడికి అక్కడ నివసించడం ఇష్టం లేదని అన్నాడు. చాలా మురికిగా ఉన్నప్పటికీ అమౌకు ఏ ఇతర వ్యాధులు సోకకపోవడం ఆశ్చర్యకరం. అతడికి దాహం వేసిన ప్రతిసారి తుప్పుపట్టిన నూనె డబ్బాలో నిల్వ ఉంచిన ఐదు లీటర్ల నీటిని తాగుతాడు.

సిగరెట్ తాగడం అంటే అమౌకు చాలా ఇష్టం. అయితే ఇక్కడ కూడా ఓ సొంత రికార్డు సృష్టించుకున్నాడు. తనకు గ్రామస్తులు ఇస్తున్న సిగరెట్లు అయిపోతే ఎండిన జంతువుల పేడను పొగ గొట్టంలో వేసుకుని దానిని పీలుస్తాడు. ప్రపంచంలోని అన్ని ఆనందాలను త్యజించిన తరువాత తాను ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నానో అది తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అమౌ అంటాడు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, అమౌ చిన్నతనంలోనే మానసికంగా ఎదురుదెబ్బలు తగిలాయని, దాంతో అతడు తన జీవితాంతం ఒంటరిగా గడపాలని నిర్ణయించుకున్నాడని అంటారు.

Next Story

RELATED STORIES