Largest cruise ship :అలలపై అలా అలా...

ప్రయాణానికి సిద్ధమవుతున్న అతిపెద్ద క్రూజ్ షిప్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌ షిప్‌ ప్రయాణానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో అలలపై అలా అలా తెలుతూ ప్రయాణించాలనుకునే వారి కోసం ఈ తొలి ఐకాన్‌ క్లాస్‌ నౌకను ఫిన్లాండ్‌లో తయారు చేశారు. ఇప్పటికే ట్రయల్స్‌ పూర్తి చేసిన ఈ నౌక 2004 జనవరి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

చుట్టూ నీళ్లు మధ్యలో మనం.. ఇలాంటి ప్రయాణం చాలామంది కోరుకుంటారు. అయితే ఆ కోరిక తీర్చుకోవడానికి ఎవరి బడ్జెట్ లో వాళ్ళు ప్లాన్ వేసుకోవచ్చు.. కానీ రిచ్ గా సముద్ర ప్రయాణం చేయాలనుకునే వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఇప్పుడు రెడీ అయ్యింది.

రాయల్‌ కరేబియన్‌కు చెందిన ఈ తొలి ఐకాన్‌ క్లాస్‌ నౌకను ఫిన్లాండ్‌లో తయారు చేశారు. ఇప్పటికే ట్రయల్స్‌ పూర్తి చేసిన ఈ నౌక 365 మీటర్ల పొడవు, సుమారు 2,50,800 టన్నుల బరువుంది. ఇందులో సుమారు 5,610 మంది ప్రయాణికులతోపాటు. 2350 మంది సిబ్బంది ఉంటారు.





ఈ క్రూజ్ లో అధునాతన రిసార్ట్‌, థీమ్‌ పార్క్‌, డైనింగ్‌ హాల్‌, వినోదాన్ని పంచే వసతులు ఎన్నో ఉన్నాయి. రకరకాల వాటర్ స్లయిడర్స్, అంటే నీళ్లలో ఉంటూ మళ్ళీ నీళ్లతో ఆడుకొనే కొన్ని స్పెషల్ ప్లేస్ లు ఇందులో ఉన్నాయి. మూడంతస్థులతో ఉన్న ఈ షిప్ ఓ ఫ్యామిలీ టౌన్‌ షిప్‌లా ఉంటుంది అనటం లో అతిశయోక్తి లేదు.

జూన్ 22న ఫిన్‌లాండ్‌లోని తుర్కులో తన మొదటి సముద్ర ట్రయల్స్ పూర్తి చేంది. ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత అధికారికంగా మొదటిసారిగా బహిరంగ సముద్రంలో ప్రయాణించింది. మొత్తం 450 మంది నిపుణులు ఓడ యొక్క ప్రధాన ఇంజిన్‌లు ప్రొపెల్లర్‌లపై నాలుగు రోజుల పాటు ప్రాథమిక పరీక్షలు, తనిఖీ లు నిర్వహించారు.

ఈ షిప్ లో ప్రయాణం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ థ్రిల్లింగ్‌గా ఉంటుందని రాయల్ కరేబియన్ సంస్థ చెబుతోంది. ఆక్వా పార్క్, స్విమ్-అప్ బార్,స్పెషల్ డైనింగ్ ప్లేస్, ఫుడ్‌ కోర్టులు, బార్లు, స్పా, థియేటర్, లైవ్ మ్యూజిక్ షో ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. సందర్శకులు మియామిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించి, బహామాస్, మెక్సికో, హోండురాస్ సెయింట్ మార్టెన్ మరియు సెయింట్ థామస్ వంటి నౌకాశ్రయాలతో తూర్పు లేదా పశ్చిమ కరేబియన్ గుండా ఐకాన్‌లో ఏడు రాత్రులు గడపవచ్చు. ప్రయాణీకులు ఎక్కినప్పటి నుంచి ప్రతి క్షణం, ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగేలా చేస్తామని చెబుతున్నారు రాయల్ కరేబియన్ సంస్థ.

Tags

Next Story