Russia: విస్తరిస్తున్న అతి పెద్ద బిలం

రష్యాఫార్ ఈస్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం బటగైకా క్రేటర్ కరిగిపోతోందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ మెగా స్లంప్ కారణంగా ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన శాశ్వత బిలం నానాటికి విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని పెరుగుదలకు భూమి వేడెక్కడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ బిలం చుట్టూ ఉన్న భూభాగం కరిగిపోవడటంతోంది. మంచు బిలం విస్తరిస్తోంది. మెగా స్లంప్ అనే శాస్త్రీయ నామం ఉన్న బటగైకాకు ‘‘మౌత్ టు హెల్’’ అనేది మరో పేరు కూడా ఉంది. బిలంపై నేల కోతకు గురై అసమానంగా ఉన్న ఉపరితలాలు కనిపిస్తున్నాయి. మంచు బిలం పెరిగిపోవడంతో చుట్టూ ఉన్న పట్టణాలు, రోడ్లు బీటలు వారుతున్నాయి. భూగర్భంలో ఉన్న పైపులైన్స్ దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాల దృష్యా భవిష్యత్తులో ఇది ప్రమాదకరం కావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
1960లో ఈ బిలాన్ని కనుగొన్నారు. అయితే ఈ ప్రాంతంలో విచక్షణారహితంగా అటవీప్రాంతాలను నిర్మూలించడంతో మంచు కరిగిపోవడంతో నేల కోతకు గురవుతోంది. ఈ బిలం ఉపరితలం నుంచి 282 అడుగుల లోతులో ఉంటుంది. అయితే ఇది పాతాళానికి వెళ్లేందుకు ఒక మార్గమని స్థానికులు నమ్ముతారు
బిలం పెరగడం ప్రమాదానికి సంకేతమని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని మూలంగా ఇప్పటి రష్యాలోని ఉత్తర, ఈశాన్య నగరాలు ప్రభావితం అయ్యాయని.. అధిక ఉష్ణోగ్రతలు బిలం పెరిగేందుకు మరింత ఊతమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com