xi jinping: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చైనా నాలుగు అంశాలతో శాంతిప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బీజింగ్‌లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో శాంతి, స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదనను క్రౌన్ ప్రిన్స్ ముందుంచారని చైనా ప్రభుత్వరంగ మీడియా వెల్లడించింది. చైనా చేసిన ప్రతిపాదనలలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన అంతర్జాతీయ పాలన, అభివృద్ధి, ప్రపంచ భద్రత తదితర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చైనాకు చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనాకు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన కీలకమైన అంతర్జాతీయ అంశాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
