Prigozhin: ప్రమాదామా... ప్రతీకారమా
రష్యా అధినేత పుతిన్(Russian President Vladimir Putin)ను ఎదిరించిన వాళ్లు, ప్రత్యర్థులుగా నిలిచిన వాళ్లు, అధికారాన్ని ప్రశ్నించిన వాళ్లు అంతుచిక్కని విధంగా మరణిస్తుండడం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించి రెండు నెలలు కూడా గడవక ముందే వాగ్నర్ గ్రూప్ అధినే(తWagner mercenary ) ప్రిగోజిన్(Yevgeny Prigozhin) విమాన ప్రమాదం(aviation tragedy)లో మరణించడం కలకలం సృష్టిస్తోంది. అయితే ఇది ప్రమాదం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యేనని, పుతిన్ ప్రతీకారమే ఈ దారుణానికి కారణమని.. అమెరికా సహా చాలా దేశాలు అంచనా వేస్తున్నాయి.
ప్రత్యర్థులను తనకు ఎదురు తిరిగిన వారిని అంత తేలిగ్గా వదిలిపెట్టరని పుతిన్‌కు పేరుంది. వాగ్నర్ తిరుగుబాటును వెన్నుపోటుగా, రాజద్రోహంగా అభివర్ణించిన పుతిన్ వెంటనే ప్రిగోజిన్‌ను క్షమించేశారు. ఈ క్షమాపణ వచ్చిన తర్వాత ప్రిగోజిన్ కూడా బెలారస్ వైపు వెళ్లిపోయారు. కానీ రష్యాపై తిరుగుబాటు ప్రకటించిన రెండు నెలల తర్వాత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. కానీ ఇది ప్రమాదం కాదని పక్కా హత్యేనని అమెరికా సహా పలు ఇంటెలిజెన్స్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనక పుతిన్ హస్తం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రిగోజిన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి... ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని అమెరికా సహా చాలా దేశాలు అనుమానిస్తున్నాయి.
వాగ్నర్ గ్రూప్ బాస్ యెవ్‌గనీ ప్రిగోజిన్‌ను హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు జరిగి ఉంటుందని పేర్కొంది. విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్ మరణించి ఉంటాడని పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్ అభిప్రాయపడ్డారు. ప్రిగోజిన్‌ది హత్యేనని వాగ్నర్ సంస్థకు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా వెల్లడించింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌తో పాటు దిమిత్ర ఉత్కిన్, వాగ్నర్ లాజిస్టిక్స్ విభాగం అధిపతి, సిరియాలో గాయపడిన వాగ్నర్ సభ్యుడు, అంగరక్షకులు, విమాన సిబ్బంది ఉన్నారు. సాధారణంగా సైనిక దళాల టాప్ లీడర్లు ఒకే విమానంలో ఎప్పుడూ ప్రయాణం చేయరు. కానీ, ఇక్కడ వాగ్నర్ గ్రూపులోని కీలక నాయకులంతా ఒకే విమానంలో సెయింట్ పీటర్స్ బర్గ్‌కు ఎందుకు బయల్దేరారన్నది కూడా తెలియడం లేదు. ప్రత్యక్ష సాక్షులు రెండు పేలుళ్లను విన్నట్లు గార్డియన్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇవన్నీ ప్రిగోజిన్‌ది హత్యే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అమెరికా నిఘా సంస్థ తెలిపింది.
ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారన్న వార్తతో వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రయాణించిన విమానయాన సంస్థ స్పందించింది. ప్రిగోజిన్ ప్రయాణించిన ఎంబ్రాయర్ లెగస్సీ 600 జెట్‌లో ప్రమాదం ముందు వరకు ఎటువంటి సమస్యను గుర్తించలేదని బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ విమాన తయారీ సంస్థ పేర్కొంది. గత 20 ఏళ్లలో ఈ రకం విమానాల్లో జరిగిన రెండో ప్రమాదం ఇదని వెల్లడించింది. కాకపోతే 2019 నుంచి తాము ఈ విమానానికి సర్వీసులు అందించడం లేదని వివరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com