kolkata : పెళ్లాడటానికి భారత్ కు వచ్చిన పాకిస్తాన్ వధువు

భారత్ అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయి. ఒకరికొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొవిడ్ సహా కొన్ని అడ్డంకులు వారిని ఐదేళ్లు దూరంగా ఉంచాయి. చివరికి తనకు కాబోయేవాడి కోసం భారత్‌లో అడుగుపెట్టింది పాక్ యువతి. బాజా భజంత్రీల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది.
కోల్‌కోతాకు చెందిన సమీర్ ఖాన్...జర్మనీలో చదువుకున్నాడు. 2018లో భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోన్‌లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన జావెరియా ఖనుమ్ ఫోటో చూశాడు. వెంటనే ఆ పాక్ యువతిపై మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. తల్లిదండ్రులు అంగీకరించినా వారికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరీ ఖనుమ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె వీసా రిజక్ట్ అయ్యింది. ఈ మధ్యలో కొవిడ్ వచ్చింది. మొత్తం ఐదేళ్లు అలా గడిచిపోయాయి. ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియా ఖనుమ్‌కు భారత్ వీసా దక్కింది. వాఘా-అటారీ అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆ పాక్ యువతి భారత్‌లోకి అడుగుపెట్టింది. బాజా భజంత్రీల మధ్య ఆమెకు సమీర్‌ఖాన్ కుటుంబం స్వాగతం పలికింది. తనకు కాబోయే భార్యకు వీసా మంజూరు చేయడంపై సమీర్‌ఖాన్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఐదేళ్లు ఒకరికొకరం ఎంతో మిస్ అయ్యామని అన్నాడు.2018లో మా ప్రేమ కథ మొదలైంది. నేను జర్మనీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, మా అమ్మ మొబైల్‌లో జావెరీ ఫొటో చూశాను. చాలా నచ్చేసింది. అమ్మవాళ్లకి జావెరీని పెళ్లి చేసుకుంటానని నా అభిప్రాయాన్ని చెప్పాను. భారత్‌లో అడుగుపెట్టాక అమృత్‌సర్ నుంచి కోల్‌కతాకు విమానంలో ఆ జంట చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో జావెరీ, సమీర్‌ఖాన్ పెళ్లి జరగనుంది. జర్మనీలో తన స్నేహితులు వివిధ దేశాలకు చెందినవారని, వారందరినీ వివాహానికి ఆహ్వానిస్తున్నట్లు సమీర్‌ఖాన్ తెలిపాడు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com