Newyork : ఫ్రీ గిఫ్ట్స్ ప్లాన్ చేసిన యూట్యూబ్ అరెస్ట్
ఫ్రీ గా వస్తే దేనినీ వదలని వారు చాలా మందే ఉంటారు. అందులోనూ అమెరికా లాంటి దేశంలో కూడా గేమింగ్ ఉత్పత్తులను గిఫ్టులుగా ఇస్తామంటే ఎగబడిపోతారు. ఓ యూట్యూబర్ చేసిన ప్రకటనతో న్యూయార్క్ వీధులు రణరంగంగా మారాయి. లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం భారీగా జనాలు వచ్చి పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో యూట్యూబర్‌తో సహా 65 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
21 ఏళ్ల కాయ్ సీనట్ ప్రముఖ యూట్యూబర్. యూట్యూబ్‌తో సహా ఇన్‌స్టాగ్రామ్, ట్వీచ్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షల కొలది ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం సీనట్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. సీనట్ ఈసారి మరో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఫాన్స్ తనను కలవాలంటే మ్యాన్ హట్టన్‌కు రావాలని, అక్కడే లైవ్ స్ట్రీమింగ్ చేద్దామని, వచ్చినవారికి అదే ప్రోగ్రామ్‌లో ప్లే స్టేషన్ కన్సోల్‌తో సహా ఉచితంగా కానుకలు ఇస్తానని సీనట్ తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. సీనట్ పోస్టుకు స్పందించిన అభిమానులు, యువత దాదాపు 2000 మంది ఆ ప్రాంతానికి వచ్చేశారు.
భారీ సంఖ్యలో వచ్చిన యువతతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్లేసులు సరిపోక ఒకరినొకరు తోసుకున్నారు. కార్లను ధ్వంసం చేశారు. భవంతుల పైకి ఎక్కి నినాదాలు చేయడం, బాటిళ్లను విసరడం వంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులను గాయపరిచారు. దీంతో పోలీసులు కూడా చిర్రెత్తుకొచ్చింది. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా యూట్యూబర్ సీనట్‌ను కూడా నిర్భందించి దర్యాప్తు చేపడుతున్నారు.
కై సీనట్ అభిమానులు మన్ హటన్ పార్క్ వీధుల్లో వాహనాలను అడ్డగించి ధ్వంసం చేశారు. బాటిళ్లు విసురుకోవడం, కార్లపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో చూస్తుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. . దీనంతటికి కారణమైన కై సీనట్ ను పోలీసులు, give away, Kai Cenat, Ney York City, Playstation 5 consoles, Twitch streamer, Union Square Park, riot, New York City, Influencer, announcement, released giftsవ్యక్తిగత భద్రతా సిబ్బంది కలిసి వేరే చోటికి చేర్చారు. స్థానిక పోలీసులు ఈ అల్లర్లకు అనుకోని మూలకారకుడిని ఇప్పుడు విచారిస్తున్నారు. శాంతిభద్రతలు దిగజారేలా చేశాడనే అభియోగాలపై ఆయనపై క్రిమినల్ కేసు పెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com