Zelensky: యుద్ధం జరుగుతున్నా ఎన్నికలకు సిద్ధమే

Zelensky: యుద్ధం జరుగుతున్నా ఎన్నికలకు సిద్ధమే
పశ్చిమ దేశాలు సహకరిస్తే సాధ్యమేనన్న జెలెన్‌స్కీ... ఉక్రెయిన్‌లో అమల్లో మార్షల్‌ లా..

పశ్చిమ దేశాల మిత్రులు సహకరిస్తే(West helps) యుద్ధ సమయంలో కూడా ఉక్రెయిన్‌లో ఎన్నికల(elections) నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky ) ప్రకటించారు. శాంతి సమయంలో ఎన్నికల నిర్వహణకు 135 మిలియన్‌ డాలర్లు($135 million) ఖర్చుచేసినట్లు చెప్పారు. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తనకు తెలియదని అందుకే అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు ఆర్థిక సాయం చేయాలని(US and Europe provide financial support ) కోరుతున్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు . ఆయుధాల సొమ్మును తీసి ఎన్నికలకు ఖర్చుపెట్టలేనని స్పష్టం చేశారు. మిత్ర దేశాలు ఖర్చును పంచుకొని, చట్ట సభ్యులు ఆమోదిస్తే యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొంటారని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా(Ukraine under martial law) అమల్లో ఉండటంతో ఎన్నికలు నిర్వహణ సాధ్యం కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ... మార్షల్‌ చట్టం నవంబర్‌ 15(expire on Nov 15) వరకు అమల్లో ఉండటంతో ఈ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా పడ్డాయి.


రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం డ్రోన్లతో మాస్కో నగరంపై దాడి చేసిన ఉక్రెయిన్‌ ఇపుడు ఏకంగా రష్యా అధీనంలోని క్రిమియాలోకి తన సైన్యాన్ని పంపించింది. ఉక్రెయిన్‌ రహస్య బృందాలు క్రిమియాలోకి ప్రవేశించడమే కాకుండా భారీగా దాడులు చేశాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌ వెల్లడించింది.


క్రిమియా పశ్చిమ తీరంలోని ఒలెన్విక, మయాక్‌ ప్రాంతాల్లో తమ దేశ నౌకాదళంతో కలిసి ప్రత్యేక దళాలు దాడులు చేశాయని ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఆపరేషన్‌ పూర్తి చేసే క్రమంలో తమ ఉక్రెయిన్‌ దళాలు ఆక్రమణదారులైన రష్యా దళాలతో పోరాడాయని చెప్పింది. ఈ దాడిలో ప్రత్యర్థులు భారీగా ఆయుధాలను, దళాలను కోల్పోయారని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ పేర్కొంది. తమ దళాలు అక్కడ ఉక్రెయిన్‌ పతాకాన్ని ఎగురవేశాయని స్పష్టం చేసింది.

మరోవైపు... తమ బలగాలు శనివారం ఒక్కరోజులోనే దాదాపు 700 మంది ఉక్రెయిన్‌ సైనికులను చంపేశాయని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ బలగాల స్థావరాలపై దాడుల్లో భాగంగా పలు ఆయుధ డిపోలు, హోవిట్జర్లు, యూఎస్‌ ఎం777 ఆర్టిలరీ వ్యవస్థలతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story