Washington meet : జెలెన్స్కీకి బిడెన్ మద్దతు

Washington meet : జెలెన్స్కీకి బిడెన్ మద్దతు
సైనిక సహాయానికి భరోసా

యుక్రెయిన్ దేశానికి మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భరోసా ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య 19 నెలలుగా సాగుతున్న యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి మరోసారి సైనిక సాయం అందింది. కొత్త భద్రతా సహాయంలో భాగంగా ఉక్రెయిన్‌కు128 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, సామగ్రిని US అందిస్తుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం వెల్లడించారు.

రష్యాతో సాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ దేశానికి అమెరికా మద్ధతు ఇస్తోంది. ఆయుధాలు, వైమానికి రక్షణ కోసం మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీ ఇచ్చినందుకు జెలెన్స్కీ బిడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యన్ దిగ్బంధనం అనంతరం పొరుగున ఉన్న పోలాండ్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతిని విస్తరించడానికి బిడెన్ అంగీకరించారని జెలెన్స్కీ చెప్పారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడ్మిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు.


వాషింగ్టన్ యుక్రెయిన్‌కు రెండవ రేథియాన్ నిర్మించిన హాక్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీ, సంబంధిత పరికరాలను కూడా పంపుతుందని బిడెన్ చెప్పారు. జెలెన్స్కీ యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, ఇతర సీనియర్ పెంటగాన్ నాయకులతో చర్చలు జరిపారు.

అదే సమయంలో US స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటనలో రక్షణ శాఖ ఇప్పటికే నిర్దేశించిన మాఫీ కింద $197 మిలియన్ల విలువైన ఆయుధాలు, సామగ్రిని కూడా అందిస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా పర్యటన తర్వాత భద్రతా సహాయానికి సంబంధించి బ్లింకెన్ ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వైట్‌హౌస్‌లో వొలొదిమిర్ జెలెన్‌స్కీ కలిశారు.

US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ప్రకారం.. ఉక్రెయిన్‌కు అందించిన సహాయంలో రష్యా వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేయడంలో సహాయపడే అనేక ఆయుధాలు, పరికరాలు ఉన్నాయి. భద్రతా సహాయంలో ఆర్టిలరీ మందుగుండు సామాగ్రి, యాంటీ ఆర్మర్ సామర్ధ్యాలు కలిగిన అనేక ఇతర ఆయుధాలు ఉంటాయి.అలాగే ఉక్రెయిన్‌కు US అందించిన ఆయుధాలలో అదనపు వాయు రక్షణ ఆయుధాలు ఉన్నాయి. ఇవి రాబోయే శీతాకాలంలో రష్యా వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.


Tags

Read MoreRead Less
Next Story