Zelenskyy :నాకు కాదు పుతిన్ కే ప్రమాదం
ప్రస్తుత పరిస్థితులలో తనకంటే పుతిన్ ప్రాణాలకకే ఎక్కువ ముప్పందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తమ దేశంపై యుద్ధం కారణంగా రష్యా కిరాయి సైన్యం అయిన వాగ్నర్ గ్రూప్, ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది అని చెప్పారు. స్పెయిన్ ప్రధాని కీవ్ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ స్పానిష్ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రైవేటు సైన్యం భారీగా నష్టపోయిందని, ఉక్రెయిన్ దళాలు ఒక్క తూర్పు ఉక్రెయిన్‌లోనే 21వేల మంది వాగ్నర్ సైనికులను హతమార్చాయని, మరో 80 వేల మందిని గాయపరచాయని జెలెన్‌స్కీ చెప్పారు. ప్రస్తుతానికి వాగ్నర్ గ్రూప్ దగ్గర కోల్పోడానికీ ఇంకేం లేదన్నారు. ఇప్పటికీ తాము వాగ్నర్ సేనను రష్యా ప్రేరేపిత మూకగానే చూస్తామని మన్నారు.
మీకు ప్రాణభయం లేదా..?’ అని ఓ రిపోర్టర్ జెలెన్‌స్కీని ప్రశ్నించగా ప్రస్తుత పరిస్థితి తనకంటే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరంగా ఉండన్నారు. నన్ను రష్యాలోని వారు మాత్రమే చంపాలని అనుకుంటున్నారు. కానీ పుతిన్‌ను ప్రపంచం మొత్తం చంపాలని కోరుకుంటోంది అని వ్యాఖ్యానించారు.
గతేడాది ఫిబ్రవరి నుంచి 16 నెలలుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. పదహారు నెలలుగా సాగుతున్న యుద్ధంలో బలమైన రష్యాను ఉక్రెయిన్ సమర్థవంతంగానే ఎదుర్కొంది. రష్యా ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన్ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగానే జూన్ 29న రష్యా సైన్యం పైన తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు కొన్ని గంటలపాటు రష్యా అధ్యక్షుడికి కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేయడంతో యెవ్గేనీ ప్రిగోజిన్ దళాలు శాంతించి వెనక్కు తగ్గాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రిగోజిన్ దళాలకు మూడు ప్రత్యామ్నాయాలు విధించినట్లు రష్యాతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవాలని, యధావిధిగా పౌరసత్వాన్ని కొనసాగించాలని లేదా బెలారస్ కు తరలిపొమ్మని సూచించినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు.
దాదాపు 12 రోజుల తర్వాత రష్యా మరోసారి ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని క్లీవ్ పై డ్రోన్లు దాడి చేసిన విషయాన్ని ఉక్రెయిన్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి అయితే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటినీ కూల్చేసిందని వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com