Zelenskyy: 3వ ప్రపంచ యుద్ధం ఉండదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

Zelenskyy: 3వ ప్రపంచ యుద్ధం ఉండదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
Zelenskyy: హాలీవుడ్ యొక్క 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫంక్షన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ "మొదటి ప్రపంచ యుద్ధం మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది.

Zelenskyy: హాలీవుడ్ యొక్క 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫంక్షన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ "మొదటి ప్రపంచ యుద్ధం మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది. రెండవ ప్రపంచ యుద్ధం పది లక్షల మందిని బలిగొంది. మూడవ ప్రపంచ యుద్ధం ఉండదు అని అన్నారు.


మా భూమిపై రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు అందరి సహాయ సహకారాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా ముగియలేదు. కానీ అంచనాలు మారుతున్నాయి" అని జెలెన్స్కీ చెప్పారు. "ఎవరు గెలుస్తారో అనేది ఇప్పటికే స్పష్టంగా ఉంది" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.


తన ప్రసంగం ప్రారంభంలో జెలెన్స్కీ రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నప్పుడు 1943లో అవార్డు ప్రదర్శన ఉద్భవించిందని చెప్పారు. అప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గౌరవంగా కనిపించాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జీవించే హక్కు కోసం, ప్రేమించే హక్కు కోసం మన ఉమ్మడి పోరాటం ఏకమైందని ఉక్రెయిన్‌కు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉక్రెయిన్‌తో పాటు పక్కనే ఉన్న NATO దేశాలకు US 3.75 బిలియన్ల సైనిక సహాయాన్ని పంపడానికి వైట్ హౌస్ కట్టుబడి ఉంది. రష్యాపై కొనసాగుతున్న పోరాటంలో తన దేశం కోసం బహిరంగ కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడుతూ దేశ ప్రజలకు ధైర్యాన్ని సైనికులకు ఉత్సాహాన్ని అందిస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.

Tags

Read MoreRead Less
Next Story