Zohran Mamdani న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి మమ్దూనీ ఘన విజయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్థానిక ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ పలు కీలక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ట్రంప్ ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులు సంచలన విజయాలు నమోదు చేశారు.
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన విజయం న్యూయార్క్ మేయర్ ఎన్నిక. ఇక్కడ భారత సంతతికి చెందిన ముస్లిం అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ (34) చారిత్రక విజయం సాధించారు. న్యూయార్క్ నగరానికి తొలి ముస్లిం మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, గడిచిన శతాబ్ద కాలంలో ఇంత పిన్న వయసులో మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిగా కూడా ఆయన చరిత్రకెక్కారు. మమ్దానీ జనవరి 1, 2026న నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా నమోదైనట్లు నగర ఎన్నికల బోర్డు వెల్లడించింది. సుమారు 2 మిలియన్లకు పైగా నగరవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా మారాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

