Zomato: జాబ్ కావాలా నాయనా..! జొమాటోలో ఉద్యోగాల భర్తీ

Zomato: జాబ్ కావాలా నాయనా..! జొమాటోలో ఉద్యోగాల భర్తీ
800 ఖాళీలు ఉన్నాయని తెలిపిన కంపెనీ సీఈఓ

ఆర్థీక మాంద్యం మూలంగా ప్రపంచంలోని ఐటీ, ఇతర కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి దీంతో వారి సరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇటీవలే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, ట్విట్టర్‌ లాంటి దిగ్గజకంపెనీలు సైతం పలు రంగాల్లోని వారి ఉద్యోగులను తీసీవేశాయి.


ఇలాంటి సమయంలో జొమాటో మాత్రం కొత్త ఉద్యోగులకు స్వాగతం పలుకుతోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ దీపీందర్‌ గోయల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. ప్రొడక్ట్ మేనేజర్లు, గ్రోత్ మేనేజర్లు , ఇంజనీర్లు కావాలని జొమాటో 800 మంది ఉద్యోగుల కోసం చూస్తుందని తెలిపారు.


ఆసక్తి ఉన్నవారు లింక్డిన్ లో తమ కంపెనీ ప్రొఫైల్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, తమ బృందం దరఖాస్తు చేసుకున్నవారిని కాంటాక్ట్‌ చేస్తారని పేర్కొన్నారు. అలాగే ఈ ఐదు రోల్స్‌ గురించి మరింత సమచారం తెలుసుకోవాలనుకుంటే deepinder@zomato.comకు మెయిల్‌ చేస్తే వివరిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story