Zomato: ఉద్యోగుల సంక్షేమం కోసం చీఫ్ ఫిట్‌నెస్ ఆఫీసర్

Zomato: ఉద్యోగుల సంక్షేమం కోసం చీఫ్ ఫిట్‌నెస్ ఆఫీసర్
తను వర్కౌట్స్, డైట్ పాటించి 15 కేజీల బరువు తగ్గడమే కాకుండా, ఉద్యోగుల శ్రేయస్సు కోసం తమ కంపెనీలో కొత్తగా చీఫ్ ఫిట్‌నెస్‌ ఆఫీసర్‌ని నియమించాడు.

ఫిట్‌నెస్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ముఖ్యం భూమిక పోషిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో మానసికంగానూ, శారీరకంగానూ ఫిట్‌గా ఉండటం తప్పనిసరైంది. దీని ప్రాముఖ్యం గుర్తించిన వ్యాపార సంస్థల యజమానులు తాము కసరత్తులు చేస్తుండటంతో పాటు, ఉద్యోగులకూ ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకన్‌బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌లు ఈ విషయంలో ముందుంటారు. ఇదే కోవలోకి భారత్‌కి చెందిన ప్రముఖ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చేరాడు.

తను వర్కౌట్స్, డైట్ పాటించి 15 కేజీల బరువు తగ్గడమే కాకుండా, ఉద్యోగుల శ్రేయస్సు కోసం తమ కంపెనీలో కొత్తగా చీఫ్ ఫిట్‌నెస్‌ ఆఫీసర్‌ని నియమించాడు. ఈ స్థానంలో అన్మోల్ గుప్తాని నియమించాడు. జొమాటో ఉద్యోగులు, డెలివరీ పార్ట్‌నర్స్, రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌ శ్రేయస్సు చూడటం కోసమే కొత్తగా ఈ స్థానాన్ని సృష్టించారు. ఈ కొత్త సీఎఫ్‌ఓ ఫిట్‌నెస్ ట్రైనర్లు, న్యూట్రిషియన్స్, కౌన్సెలర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయనున్నారు.

ఉద్యోగుల శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడులు ఉంటాయన్నాడు.


తన ఈ నిర్ణయం వెనక కారణాల్నీ వెల్లడించాడు. "2019 సంవత్సరంలో కొవిడ్ విపత్తుకు ముందు, నా పనితో సమానంగా నా ఆరోగ్యాన్ని చూస్తూ వచ్చాను. శారీరకంగా, మానసికంగా అత్యుత్తమంగా ఉంటే ఎక్కువగా పనిచేయగలను" అని వెల్లడించాడు. "2019లో 87 కేజీల బరువు ఉన్న నేను, 2023 సంవత్సరానికి 72కి చేరాను. శరీరంలో కొవ్వు శాతం 28 శాతం నుంచి 11.5 శాతానికి దిగివచ్చింది."

అయితే ఈ ప్రయాణంలో తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా తిన్నానన్నాడు. వాటిపై ఎలాంటి నియంత్రణలు విధించుకోలదన్నాడు.

గుర్‌గావ్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫిట్‌నెస్‌ సెంటర్‌ని నెలకొల్పారు. దీంతో పాటుగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం పీరియడ్ లీవ్స్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. దంపతులు, సేమ్-సెక్స్ పేరెంట్స్, దత్తత, సరోగసీ వంటి విధానాల ద్వారా తల్లిదండ్రులు అయిన ఉద్యోగులకు 6 నెలల పాటు సెలవులు ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story