వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే.. ఏడు చోట్ల గాయాలు..

YS Vivekananda Reddy is the suspicion of death
  • వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని ప్రాథమిక నిర్థారణ పోస్టుమార్టం
  • నివేదికలో హత్యగా తేలినట్లు సమాచారం
  • పోస్టుమార్టం నివేదికలో ఏడు చోట్ల గాయాలు
  • పదునైన ఆయుధంతో తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తింపు
  • నుదుటిపై లోతైన రెండు గాయాలు గుర్తింపు తల వెనుక భాగంలో మరో గాయం

అనుమానాస్పదంగా మృతి చెందిన మాజీ ఎంపీ వై.ఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని తేలిపోయింది. పోస్టు మార్టం ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివేకానంద శరీరంపై ఏడు బలమైన కత్తి గాయాలను గుర్తించినట్టు తెలుస్తోంది. వివేకా శరీరంపై ఉన్నవన్నీ పదునైన గాయాలే అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పదునైన ఆయుధంతో చేసిన రెండు గాయాలు నుదిటిపై, తల వెనుక, తొడపైనా, చేతిపైనా గాయాలను పోస్టుమార్టంలో గుర్తించారు..

వివేకానందది హత్యే అని తేలడంతో ఎవరు హత్య చేయించి ఉంటారు అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా..? కుటుంబ విబేధాలు, ఆర్థిక కారణాలు ఉన్నాయా అనే కోణలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అదనపు ఎస్పీ బి.లక్ష్మీనారాయణ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. డీజీపీ, ఇంటెలిజెన్స్‌, కడప జిల్లా పోలీసులతో మాట్లాడిన సీఎం.. అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దోషులను వెంటనే ఆరెస్ట్‌ చేయాలని.. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.